వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: బిడ్డకు పాలిచ్చిన ట్రాన్స్‌జెండర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 30 ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళ తన బిడ్డకు పాలిచ్చి చరిత్ర సృష్టించింది. ఇలా ఓ ట్రాన్స్ జెండర్ బిడ్డకు పాలివ్వడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. ట్రాన్స్‌జెండర్ వైద్య చరిత్రలోనే ఇది అద్భుతమైన వైద్యమని డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకమైన వైద్య విధానానికి సంబంధించిన పుస్తకంలో ఈ విషయాలను డాక్టర్లు ప్రకటించారు.

తన భాగస్వామి బిడ్డకు పాలివ్వడానికి నిరాకరించడంతో ఆమె మౌంట్ సినాయ్‌లోని సెంటర్ ఫర్ ట్రాన్స్‌జెండర్ మెడిసిన్ అండ్‌ సర్జరీలోని డాక్టర్లను ఆశ్రయించింది
ఆమె తన బిడ్డకు పాలిచ్చేలా ప్రత్యేకంగా డాక్టర్‌తో ట్రీట్ మెంట్ తీసుకొంది. ఆమెకు హర్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చికిత్స మూడున్నర నెలల పాటు తీసుకొంది.అయితే ఈ థెరపీ కారణంగా ఆమె బిడ్డకు పాలిచ్చేలా ఆమె శరీరంలో మార్పులు సంభవించాయి.

Breakthrough? In a world's first, transgender woman able to breastfeed her baby

అయితే ఆమె ఉపయోగించిన మందులు అమెరికాకు చెందిన ఎఫ్‌డిఏ అనుమతి మాత్రం పొందలేదు. కానీ, ఈ మందులు సాధారణంగా డిఐవై హర్మోన్ థెరపీలో ఉపయోగిస్తారు.ఈ చికిత్స వల్ల ప్రతి రోజూ రొమ్ము భాగంలో 8 ఔన్సుల పాలను ఉత్పత్తి చేస్తోంది.

బిడ్డ పుట్టే సమయానికి ఆమెలో చనుబాల వృద్ధి కనిపించింది. మొదట ఆరు వారాల పాటు అలా పాలిచ్చిన ఆమె.. తర్వా ఆరు నెలలపాటు కొనసాగించింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఇచ్చే మందులకు సంబంధించి ఇది చాలా పెద్ద పురోగతి అని ఆమెకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ టామర్ రీస్మాన్ చెప్పారు.

English summary
In a first, a 30-year-old transgender woman has been able to breastfeed her baby.the woman was able to breastfeed without undergoing gender reassignment surgeries like breast augmentation or a vaginoplasty. She hasn't even given birth to the child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X