బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహజీవనం-బ్రేకప్: ప్రియురాలిని కత్తితో వెంటాడిన సీఈవో.. ఏం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయడంతో తన ప్రియుడిని దూరంగా పెట్టింది ఓ అమ్మాయి. అంతేగాక, అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న ఆమె ప్రియుడు స్టార్టప్ సీఈఓ నుంచి హంతకుడిలా మారేందుకు సిద్ధమయ్యాడు. పదునైన ఆయుధాన్ని వెంటపట్టుకుని ఆమె వెంటపడుతున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

శారీరకంగా.. మానసికంగా..

శారీరకంగా.. మానసికంగా..

28ఏళ్ల రాహుల్ సింగ్ ఓ స్టార్టప్ సీఈఓగా పనిచేస్తున్నాడు. అతని 24ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడింది. దీంతో అతనితో ఏడాది కాలంగా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే, రాహుల్ సింగ్ ఆమెను శారీరకంగా, మానసికంగా తరచూ వేధించడంతో ఆమె అతడకి బ్రేకప్ చెప్పింది.

ఎటు వెళ్లినా..

ఎటు వెళ్లినా..

ఈ ఏడాది మొదటి నుంచి అతనికి ఆమె దూరంగా ఉంటోంది. ఇక తన జీవితం సాఫీగా కొనసాగుతుందని ఆమె భావించింది. అయితే, అలా జరగలేదు. ఆమె ఇంటి ముందే రాహుల్ మకాం వేయడం మొదలుపెట్టాడు. ఆమెను ఫోన్, ఈమెయిల్స్ ఉపయోగించి ఆమె వెంటపడుతున్నాడు. ఆమె ఎటూ వెళ్లినా ఆమెను ఫాలో అవుతూ వేధిస్తున్నాడు.

చంపుతామంటూ బెదిరింపులు

చంపుతామంటూ బెదిరింపులు

రెండ్రోజుల క్రితమే రాహుల్ తండ్రి ప్రదీప్ కుమార్ సింగ్ తన తల్లికి ఫోన్ చేసి రాహుల్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారని బాధిత యువతి తెలిపింది. కేసును ఉపంసహరించుకోకపోతే తనను చంపుతానని తన తల్లిని బెదిరింపులకు గురిచేశారని ఆమె మీడియాకు వెల్లడించింది.

ఫోన్ చోరీ, ఈమెయిల్స్ హ్యాక్..

ఫోన్ చోరీ, ఈమెయిల్స్ హ్యాక్..

రాహుల్ బాధిత యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమె ఫోన్ చోరీ చేయడంతపాటు, ఆమె సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశాడు. ఈ మేరకు ఆమె హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రాహుల్ సింగ్‌ను పిలిపించి గట్టిగా హెచ్చరించి వదిలేశారు.

కత్తితో వెంటపడ్డాడు..

కత్తితో వెంటపడ్డాడు..


అయితే, ఆ తర్వాత రాహుల్ మరింత రెచ్చిపోయాడు. బాధిత యువతికి అశ్లీల సందేశాలను పంపడం మొదలుపెట్టాడు. ఆమె ఉంటున్న ఇంటి సెక్యూరిటీ గార్డుకి లంచం ఇచ్చి.. ఆమె ఎక్కడికి వెళుతుందో తెలుసుకునే వాడు. సెప్టెంబర్ 18న తాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో రాహుల్ ఓ కత్తితో తన వెంటపడ్డాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. బాధిత యువతి నుంచి ఫిర్యాదు స్వీకరించామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఆమె భద్రత కోసం ఆమె ఇంటి వద్ద పోలీసులను కూడా ఉంచామని చెప్పారు.

English summary
The CEO of a Bengaluru-based startup company turned into a full-fledged stalker after his girlfriend broke up with him because of repeated physical and verbal abuse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X