వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఢిల్లీలో పొగ పీల్చితే 7 సిగరెట్లు తాగినట్టేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీలో గాలిని పీల్చితే రోజుకూ సుమారు 7.7 సిగరెట్లు తాగినట్టే. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. న్యూఢిల్లీలో గాలి పీల్చితే రోజుకూ 7.7 సిగరెట్లు తాగినట్టే,. ముంబైలో కూడ వాయు కాలుష్యం పెరుగుతోంది. ముంబైలో గాలి పీల్చితే సుమారు 4 సిగరెట్లు తాగినట్టే లెక్క.

Breathing Mumbai’s air as bad as puffing 4 cigarettes a day, Delhi worse at 7.7

మిగిలిన నగరాల్లో కూడ పరిస్థితి ఇలానే ఉంది. సగటున వ్యక్తి రోజుకు రెండు నుంచి ఎనిమిది సిగరెట్లు కాల్చుతున్నట్లే లెక్క. వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఏప్రిల్‌లో 'షూట్‌ ఐ స్మోక్‌' అనే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను పారిస్‌లో విడుదల చేశారు.

ఈ యాప్‌ ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లోని గాలి స్వచ్చతను సిగరెట్‌ పొగతో పోల్చి అంచనాలను చూపుతుంది. ఇలా భారత్‌లోని కీలక నగరాల​ గాలి స్వచ్చత తీవ్ర స్థాయిలో దిగజారినట్లు ఈ యాప్‌ తెలుపుతోంది. కేంద్ర కాలుష్య నివారణ సంస్థ(సీపీసీబీ) మాత్రం ఈ యాప్‌ అంచనాలు సరైనవి కావంటూ కొట్టి పారేసింది. విదేశాల్లో చేసిన పరిశోధనల ఆధారంగా భారత్‌లో వాయు కాలుష్యాన్ని సిగరెట్‌ పొగతో పోల్చి చెప్పడం సరికాదని పీసీబీ అభిప్రాయపడింది.

దేశంలో గాలి కాలుష్యానికి సంబంధించిన డేటాను మాత్రమే అధికారికంగా సీపీసీబీ మాత్రమే విడుదల చేస్తుందని తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీని పేర్కొన్న విషయం తెలిసిందే. సంస్థ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన తొలి 20 నగరాల్లో భారత్‌కు చెందినవి 14 ఉన్నాయి.

English summary
Breathing Mumbai’s air has the same effect on your body as smoking four cigarettes a day. In Delhi, it’s 7.7 cigarettes. Other big Indian cities aren’t far behind, with the effect ranging from two to eight cigarettes a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X