వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెగ్జిట్ ఎఫెక్ట్: మోడీపై మళ్లీ కాలుదువ్వుతున్నకేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ 'బ్రెగ్జిట్' దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలని బ్రిటన్ రిఫరెండం నిర్వహించగా.. ఎక్కువ మంది ప్రజల దానికే మొగ్గు చూపారు.

అదే మనల్ని కాపాడుతుంది: బ్రెగ్జిట్‌పై రాజన్, ఎలాంటిదైనా సిద్ధం: జైట్లీ

బ్రెగ్జిట్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా పైన రెఫరెండం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

kejri

బ్రెగ్జిట్‌ను ఆయన ప్రేరణగా తీసుకున్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి హోదా కోసం తాను త్వరలో రెఫరెండం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ రెఫరెండంకు తీర్పు వచ్చిన కాసేపటికే ఆయన ఈ ట్వీట్ చేశారు.

బ్రెగ్జిట్ ఎఫెక్ట్: భారత్ ఐటీ కంపెనీలపై దెబ్బ, ఎలా?

తొలుత కేంద్రపాలిత కేంద్రంగా ఉన్న ఢిల్లీకి, తర్వాత పరిమిత అధికారాలతో రాష్ట్ర హోదా ఇచ్చారు. అయితే పోలీసులు, ఏసీబీ శాంతిభద్రతల విభాగం కేంద్రం పరిధిలో ఉంది. దీనిపై కేజ్రీవాల్ చాలా రోజులుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రెఫరెండం ద్వారా ప్రధాని మోడీ పైన ఆయన మరోసారి కాలు దువ్వేందుకు సిద్ధమయ్యారు.

English summary
As the world witnessed a historic mandate under a European Union referendum with United Kingdom (UK) voting to opt out of it, similar feelings have begun to surface closer home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X