వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిక్స్ సదస్సు: ఆలస్యంగా పుతిన్, మోడితో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

పానాజి: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల అధ్యక్షులు గోవా రాజధాని పానాజి చేరుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైఖిల్ తెమెర్, సౌతాఫ్రియా అధ్యక్షుడు జాకోబ్‌జుమా గోవా చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు

పుతిన్ కాస్తా ఆలస్యంగా పానాజికి చేరుకున్నారు. సైనిక వందనంతో పాటు సంప్రదాయ నృత్యాలతో అతిథులను ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో సీమాంతర ఉగ్రవాదంతో పాటు పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై బ్రిక్స్ దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

BRICS Summit: Modi meets Vladimir Putin, likely to sign key defence deals

ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 10 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శనివారంనాడు నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రష్యా, భారత్ మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం జరిగే అవకాశం ఉంది. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ షెడ్యూల్ ప్రకారం రాత్రి ఒంటి గంటకు చేరుకోవాల్సి ఉంది. కానీ, దట్టమైన పొగ మంచు కారణంగా ఆయన తెల్లవారు జామున మూడు గంటలకు చేరుకున్నారు.

బ్రిక్స్ సదస్సుకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. ఐఎన్ఎస్ హన్సా బే్స నుంచి బిక్స్ సదస్సు జరిగే బెనాలియం గ్రామంలోని హోటల్ ప్రాంతం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశం కోసం రాత్రే మోడీ గోవాకు చేరుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi met Russian President Vladimir Putin ahead of the BRICS Summit in Goa on Saturday. The two leaders shook hands and exchanged greetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X