హెలిక్యాప్టర్ పల్లకిగా నూతన వధువు వివాహవేదికకు చేరుకొంది
జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం చేసుకోవాలని భావిస్తారు. కాని, తన వివాహం అందరు చర్చించుకొనేలా చేసుకొన్నాడు వినోద్ అనే వ్యక్తి.
గురుగ్రామ్: పెళ్ళి జీవితాంతం గుర్తుంచుకొనేలా చేసుకోవాలని కోరుకొంటారు. అయితే కొందరు గాలిలో , మరికొందరు నీళ్ళలో వివాహలు చేసుకొన్న సందర్భాలు చూశాం. కాని, తన పెళ్ళిని అందరూ గుర్గుంచుకొనేలా ఓ వరుడు వినూత్నంగా ఆలోచించాడు.పల్లకిగా హెలిక్యాప్టర్ ను మార్చాడు. పెళ్ళి వేదికకు వధువును తెచ్చేందుకు హెలిక్యాప్టర్ ను అద్దెకు తీసుకొన్నాడు. హెలిక్యాప్టర్ లో వధువు పెళ్ళి వేదికకు చేరుకోవడంతో వార్తల్లో నిలిచారు.
గురుగ్రామ్ కు చెందిన వినోద్ వాట్స్ అనే యువకుడు లలితను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. తన వివాహం విషయంతో వార్తల్లో నిలవాలని భావించాడు. ఈ మేరకు ఆయన వధువును హెలిక్యాప్టర్ లో వివాహ వేదికకు తీసుకురావాలని భావించాడు.

వధువు ఇంటి నుండి ఆమెను తీసుకు వచ్చేందుకు గాను హెలిక్యాప్టర్ ను అద్దెకు తీసుకొన్నాడు వినోద్. హెలిక్యాప్టర్ వధువు గ్రామంలో ల్యాండ్ అయ్యేందుకు జిల్లా అధికారుల అనుమతి తీసుకొన్నాడు. హెలిక్యాప్టర్ కు రెండు లక్షల రూపాయాలను అద్దె కింద చెల్లించాడు.
వినోద్ తండ్రి బాబులాల్ డిల్లీ మున్సిఫల్ కార్పోరేషన్ లో ఉద్యోగి. ఆయనకు కూడ తన కొడుకు వివాహం అందరూ గుర్తుంచుకొనేలా చేయాలనే తపన ఉంది. తండ్రి కొడుకులిద్దరూ ఈ పథకాన్ని అమలు చేశారు. వధువు నివాసం ఉండే గ్రామం బాద్షాపూర్ కు హెలిక్యాప్టర్ ను పంపారు. ఈ హెలిక్యాప్టర్ లో వధువును గురుగ్రామ్ కు రప్పించారు. వివాహ వేదికకు వధువును పల్లకిలో తీసుకురావడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారంగా పల్లకి బదులుగా హెలిక్యాప్టర్ ను పంపాడు వినోద్.వినోద్ కారణంా ఈ వివాహం వార్తల్లోకెక్కింది.












Click it and Unblock the Notifications