వరుడికి షాక్: కాసేపట్లో పెళ్లనగా.. ప్రియుడితో పరారైంది!

Subscribe to Oneindia Telugu

ధార్వాడ: అచ్చం సినిమాల్లోలాగే ఇక్కడా చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు.. ప్రియుడితో పరారైంది. అప్పటి వరకు ఎంతో సందడి, ఆనందంగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్ధంగా తయారైంది. విషయం తెలిసిన ఇరుకుటుంబాల వారు హతాశులయ్యారు. ఈ ఘటన క‌ర్ణాట‌క‌ ధార్వాడ నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌ ధార్వాడ నగరంలోని దైవజ్ఞ కల్యాణ మంటపం ముస్తాబైంది. రిసెప్షన్‌ కోసం బంధువుల, అతిథిలూ వచ్చారు. ముహూర్తం సమీపించింది. వధువును తీసుకురావాల్సిందిగా పెద్దలు పురమాయించారు. చూసేందుకు వెళ్లిన వారు.. వధువు అక్కడ లేకపోవడం అవాక్కయ్యారు.

bride escaped from her wedding ceremony

పెళ్లి కుమార్తె కనిపించలేదనే కబురు ధావనంలా పాకింది. మంటపం చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోయింది.చివరకు ఆమె తన ప్రియుడితో ఆమె పరారైనట్లు తేలింది. తమ కుమార్తె కనిపించలేందంటూ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివాహం వాయిదా పడినట్లు బోర్డును తగిలించారు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా వెళ్లిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A bride escaped from her wedding ceremony for met her lover in Dharwad district in Karnataka state.
Please Wait while comments are loading...