వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలే కళ్లు లేని పిల్లలు.. వాళ్లపై లైంగిక వేధింపులా? ఈ బ్రిటీష్ అంకుల్ కి బుద్ధి ఉందా?

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. ముగ్గురు అంధ విద్యార్థులపై బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. ముగ్గురు అంధ విద్యార్థులపై బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శనివారం ఆ బాలురపై లైంగిక దాడికి పాల్పడుతూ అతను పోలీసులకు చిక్కాడు. గత ఏడాదిగా నిందితుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

బ్రిటన్‌కి చెందిన ముర్రే డేనిస్‌ వార్డ్‌(54) గుర్‌గావ్‌లో ఓ ప్రముఖ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీలో అంధ బాలుర కోసం ఎన్జీవో సంస్థ నడుపుతున్న ఆశ్రమంలో పాఠాలు చెప్పేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ అక్కడికి వచ్చి వెళ్తుండేవాడు.

British ‘uncle’ who ‘sexually abused’ Delhi blind kids visited school for years

కానీ శనివారం వార్డ్‌ ప్రవర్తనపై అక్కడి వారికి అనుమానం వచ్చింది. అతను వెళ్లిపోయాక వారు విద్యార్థులను ప్రశ్నించగా అసలు విషయం బయటికొచ్చింది. వార్డ్‌ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ముగ్గురు విద్యార్థులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వసంతకుంజ్‌లో నివాసముంటోన్న వార్డ్‌ ఇంటికి పోలీసులు ఆదివారం వెళ్లగా.. ఆ సమయంలో అతడు బాలలపై లైంగిక దాడికి పాల్పడుతూ ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోలను చూస్తూ కనిపించాడు. పోలీసులు వార్డ్‌ని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న ఫోన్‌, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వార్డ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని, 10సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని బ్రిటీష్‌ హైకమిషన్‌కి సమాచారం అందజేశామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ ఈశ్వర్‌ సింగ్‌ తెలిపారు. గత ఏడాది అక్టోబరు నుంచి అతడు భారత్‌లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వార్డ్ కుటుంబం యూకేలో నివాసముంటోంది.

English summary
Murray Denis Ward, the 54-year-old British man arrested on Sunday for alleged sexual abuse of three visually-impaired children in Delhi, had been a regular visitor to the National Association for the Blind, the scene of the incident, for eight years. Interviews with an official of the Association (known as NAB) and two policemen on Tuesday gave a more detailed picture of the accused and the progress of the case against him. Ward “had image of an uncle who loved interacting with kids until the incident came to light,” said Prashant Ranjan Verma, the general secretary of NAB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X