Brother: లేడీస్ గొడవ, జలాయి తమ్ముడిని పొడిచి చంపేసిన అన్న, ఇంటికి వస్తే ఇదే పంచాయితి !
చెన్నై/ కోయంబత్తూరు: సొంత అన్నదమ్ములు వయసుకు వచ్చే వరకు ఒకే ఇంట్లో ఉన్నారు. అన్న బుద్దిగా తండ్రి చెప్పిన పనులు చేసుకుంటున్నాడు. తమ్ముడు జలాయిగా తిరగడం మొదలు పెట్టాడు. తండ్రి ఎన్ని బుద్దిమాటలు చెప్పినా చిన్న కొడుకు మాత్రం పద్దతి మార్చుకోలేదు. మద్యం సేవించడం, ఊరిలో కనపడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు. చిన్న కొడుకు దెబ్బతో అతని తండ్రి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి సిటీలోని ప్రముఖ రెస్టారెంట్ లో చిన్న కొడుకు ఉద్యోగంలో చేరడంతో అతని తండ్రి, అన్న కొంచెం ఊరిపిపీల్చుకున్నారు. అయితే సెలవుల్లో సొంత ఊరికి వస్తున్న యువకుడు ఆ ఊరిలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవడం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవుల మీద ఊరికి వెళ్లిన యువకుడిని ఓ మహిళ విషయంలో అతని సొంత అన్న కత్తితో పొడిచి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. తమ్ముడి టార్చర్ తట్టుకోలేక అతని అన్న చంపేశాడని పోలీసులు అంటున్నారు.
Actress:
ప్రముఖ
నటి
సోదరుడి
భార్య,
అన్న
ఒకేసారి
ఆత్మహత్య,
ఇంట్లో
అన్నీఅమ్మేయండి,
డెత్
నోట్
!

ఒకే తండ్రి కొడుకులు
తమిళనాడులోని తిరువూరు సమీపంలోని ఎంకన్ గ్రామంలోని శివరామన్ నగర్ లో తంగరసు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తంగరసుకు అయ్యప్పన్ (26), అరుణ్ కుమార్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంత అన్నదమ్ములు అయిన అయ్యప్పన్, అరుణ్ కుమార్ వయసుకు వచ్చే వరకు ఒకే ఇంట్లో ఉన్నారు.

మద్యంకు బానిస.....లేడీస్ పిచ్చి
అన్న అయ్యప్పన్ బుద్దిగా అతని తండ్రి తంగరసు చెప్పిన పనులు చేసుకుంటున్నాడు. అయ్యప్పన్ తమ్ముడు అరుణ్ కుమార్ జలాయిగా తిరగడం, కనపడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తండ్రి తంగరసు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్ని బుద్దిమాటలు చెప్పినా చిన్న కొడుకు అరుణ్ కుమార్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదు.

చిన్న కొడుకుతో తండ్రికి నానా ఇబ్బందులు
అరుణ్ కుమార్ మద్యం సేవించడం, సిగరేట్లు తాగడం ఊరిలో కనపడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు. చిన్న కొడుకు అరుణ్ కుమార్ దెబ్బతో అతని తండ్రి తంగరసు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి కోయంబత్తూరు సిటీలోని ప్రముఖ రెస్టారెంట్ లో తంగరసు చిన్న కొడుకు అరుణ్ కుమార్ ఉద్యోగంలో చేరడంతో అతని తండ్రి తంగరసు, అన్న అయ్యప్పన్ కొంచెం ఊరిపిపీల్చుకున్నారు.

తమ్ముడిని పొడిచి చంపేసిన అన్న
కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తున్న అరుణ్ కుమార్ నెలలో రెండు రోజులు సెలవుల్లో సొంత ఊరికి వెలుతున్నాడు. ఊరికి వెలుతున్న అరుణ్ కుమార్ ఆ ఊరిలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవడం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవుల మీద ఊరికి వెళ్లిన అరుణ్ కుమార్ మద్యం మత్తులో ఒ మహిళ ఇంట్లోకి దూరిపోయాడు. ఆ సమయంలో పెద్ద రచ్చ జరిగింది. ఆ మహిళ విషయంలో గొడవ జరగడంతో అరుణ్ కుమార్ ను అతని సొంత అన్న అయ్యప్పన్ కత్తితో పొడిచి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.