బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus effect: వీధి కుక్కలు పెంచడానికి లైసెన్స్, స్టేటస్ కోసం పాటు, దూలతీరింది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన, ఆ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీలో ఇక ముందు పెంపుడు కుక్కలను అడ్డంగా పెంచడానికి అవకాశం లేకుండా పోతోంది. అంటు వ్యాధులు అరికట్టడంలో భాగంగా ఇక ముందు పెంపుడు కుక్కలు పెంచాలంటే కచ్చితంగా BBMP నుంచి లైసెన్స్ తీసుకోవాలని అధికారులు కొత్త చట్టం తెరమీదకు తీసుకువచ్చారు. ఇంతకాలం ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా స్టేటస్ చూపించడం కోసం పెంపుడు కుక్కలను పెంచుతున్న కొందరికి కొత్త చట్టంతో దూలతీరుపోతుందని అధికారులు అంటున్నారు.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

 కుక్కల ఇంటింటి రామాయణం

కుక్కల ఇంటింటి రామాయణం

బెంగళూరు సిటీలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద కుక్కల దెబ్బలకు ప్రజలు రోడ్ల మీద తిరగాలంటే భయపడిపోతున్నారు. కుక్కల భాదనుంచి ప్రజలను తప్పించడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. బెంగళూరులో దాదాపుగా 70 శాతం ఇండ్లల్లో పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా పెంపుడు కుక్కలు పోషిస్తున్నారు.

 హైకోర్టులో వివాదం

హైకోర్టులో వివాదం

బెంగళూరులో కుక్కలను అరికట్టడానికి 2013 నగరాభివృద్ది చట్టం ప్రకారం అప్పటి బీబీఎంపీ కమిషనర్ అధికారులు 2018లో ప్రత్యే బైలా తయారు చేశారు. 2018 బీబీఎంపీ అధికారులు తయారు చేసిన బైలాను సవాలు చేస్తూ కొందరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బీబీఎంపీ అధికారులు తయారు చేసిన ప్రత్యే బైలాను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.

 ఐదు నెలలకు గ్రీన్ సిగ్నల్

ఐదు నెలలకు గ్రీన్ సిగ్నల్

2020 ఫిబ్రవరిలో అప్పటి బీబీఎంపీ కమిషనర్ పెంపుడు కుక్కల పెంపకం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రత్యేక బైలా తయారు చేశారు. 2020 ఫిబ్రవరిలో తయారు చేసిన ప్రత్యేక బైలాను బీబీఎంపీ కౌన్సిల్ సమావేశంలో పెట్టారు. బెంగళూరు సిటీలో పెంపుడు కుక్కలను పెంచిపోషించడానికి రూపోందించిన కొత్తచట్టం బైలాను ఐదు నెలల తరువాత బీబీఎంపీ కౌన్సిల్ ఆమోధించింది.

 అక్కడ ఓకే అంటే ఇక్కడ అంతే

అక్కడ ఓకే అంటే ఇక్కడ అంతే

బీబీఎంపీ తయారు చేసిన కొత్త బైలాను నగరాభివృద్ది శాఖ పరిశీలించి ఓకే చెప్పాలి. నగరాభివృద్ది శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత బెంగళూరు ప్రజల ముందుకు తీసుకువస్తారు. బెంగళూరు ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పిన తరువాత బైలాలో కొన్ని మార్పులు చేసి పెంపుడు కుక్కల కోసం తయారు చేసి కొత్త చట్టం అమలులోకి తీసుకువస్తారు. ఈ దెబ్బతో బెంగళూరు సిటీలో ఇక ముందు ఎవరైనా పెంపుడు కుక్కలను పెంచిపోషించాలనుకుంటే బీబీఎంపీ అధికారుల నుంచి కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందే అని కొందరు అధికారులు అంటున్నారు.

 బైలాలోని కొత్త నియమాలు

బైలాలోని కొత్త నియమాలు

*. బెంగళూరు సిటీలోని అపార్ట్ మెంట్స్ లో డాబర్ మెన్, జర్మన్ షెపర్డ్, రాట్ వెయ్లర్, హౌండ్ తదితర జాతి కుక్కలను అక్రమంగా పెంచడానకి ఇకముందు అవకాశం ఉండదు. కచ్చితంగా బీబీఎంపీ అధికారుల అనుమతితోనే ఇలాంటి కుక్కలను పెంచుకోవాలి.

*. నియమాలు ఉల్లంఘించి పెంపుడు కుక్కలను పోషిస్తున్న ఇంటి యజమానులకు బీబీఎంపీ కమిషనర్ అపరాదరుసుం విధిస్తారు.

*. నియమాల ప్రకారం కుక్కలను దత్తత తీసుకుని పెంచి పోషించుకోవాడినికి అధికారులు అనుమతి ఇస్తారు.

*. పార్క్ లు, రోడ్లు, ఫుట్ పాత్ లు తదితర బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు కుక్కలు మలమూత్రవిసర్జన చేసినా, అపరిశుభ్రం చేసినా వాటిని శుభ్రం చెయ్యాల్సిన భాద్యత పెంపుడు కుక్కల యజమానులదే. బీబీఎంపీకి సిబ్బందికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం ఉండదు.

*. పెంపుడు కుక్కలను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకు వచ్చే సమయంలో ఆ కుక్కలు ఇతరుల మీద, సాటి కుక్కలను మీద దాడి చేసి కరవకుండా వాటి మూతులను కచ్చితంగా బట్టతో కట్టాలి.

*. పెంపుడు కుక్కల వలన బెంగళూరు సిటీలో అంటువ్యాధులు వ్యాపించుకుండా చూడటానికి కొత్త నియమాలు తీసుకువస్తున్నారు.

*. నియమాలు ఉల్లంఘించి పెంపుడు కుక్కలను పెంచి పోషించినా, వాటిని బయటకు తీసుకువచ్చినా బీబీఎంపీ అధికారులు మొదటి సారి రూ. 500 జరిమానా విధిస్తారు. తరువాత కూడా పదేపదే ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో అపరాదరుసుం వసూలు చెయ్యాలని బీబీఎంపీ అధికారులు ఆలోచిస్తున్నారు.

 స్టేటస్ కోసం పాటుపడుతున్నారు

స్టేటస్ కోసం పాటుపడుతున్నారు

బెంగళూరులో ఇంట్లో పెంచుకుంటున్న వీధి కుక్కలను రోడ్ల మీదకు తీసుకు వచ్చే సమయంలో అన్ని నియమాలు పాటించాలని, లేదంటే జోబులు ఖాళీ చేసుకోవడానికి రెఢీగా ఉండాలి బీబీఎంపీ అధికారులు అంటున్నారు. ఇంతకాలం విలాసవంతమైన ఖరీదై కార్లలోని గ్లాస్ డోర్లలో కుక్కలు తల బయటపెట్టేవిధంగా వారివారి స్టేటస్ చూపించుకుంటూ రోడ్ల మీద గిర్రుగిర్రున తిరుగుతూ పాటుపడిన కొందరు బిల్డప్ గాళ్లకు కళ్లెం వెయ్యాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. నియమాలు పాటించకుండా రోడ్ల మీదకు పెంపుడు కుక్కలను తీసుకు వస్తే మొదట రూ. 500 అపరాదరుసుం విధించాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు.

English summary
Coronavirus effect: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) okays pet dogs licencing bye law in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X