వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ధైర్యం: 30న బ్రస్సెల్స్‌కు, భారతీయులు క్షేమం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 30వ తేదీన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్వర్యంలో జరగనున్న నాల్గవ యూరోపియన్ యూనియన్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి వికాశ్ స్వరూప్ పేర్కొన్నారు.

యూరప్‌లో భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఈ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. బెల్జియం పర్యటన ముగించుకొని అటు నుంచి అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్యటిస్తారని, అక్కడ మార్చి 31- ఏప్రిల్ 1న జరిగే అణుభద్రత సదస్సులో ఆయన పాల్గొంటారని చెప్పారు.

అనంతరం సౌదీ అరేబియాలోని రియాద్‌కు ప్రధాని మోడీ వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది ఇలా ఉంటే బ్రస్సెల్స్ పేలుళ్లలో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్టు వార్తలు వస్తుండగా, అందులో ఒకరు మాత్రమే గాయపడినట్టు తమకు కూడా సమాచారముందని ఆయన తెలిపారు.

కాగా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. విమానాశ్రయంలోని డిపార్చర్‌ హాల్‌లో అమెరికా ఎయిర్‌లైన్స్‌ డెస్క్‌ సమీపంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

మరోవైపు బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనతో భారత్ అప్రమత్తమైంది. రాజ‌ధాని బ్రసెల్స్‌లో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో అక్క‌డి భారతీయులు క్షేమంగా ఉన్నార‌ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. పేలుళ్ల‌పై ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. అక్క‌డి పరిస్థితిని ఎప్పటిక‌ప్పుడూ తెలుసుకుంటున్నామని చెప్పారు.

Brussels attack: PM Modi's visit to go as planned on March 30, says government

పేలుళ్లలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన భారతీయ మహిళా ఉద్యోగి గాయపడిందని, ఆమెను చికిత్స నిమితంత్ ఆసుపత్రికి తరలించినట్లు సుష్మ తెలిపారు. కాగా జెట్ ఎయిర్‌వేస్ మాత్రం ఇద్దరు మహిళా సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. పేలుళ్ల కారణంగా ముంబై నుంచి బ్రస్సెల్స్ వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి.

జెట్ ఎయిర్‌వేస్ సంస్ధ తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రస్సెల్స్ నుంచి ఢిల్లీ, ముంబై, టొరంటో తదితర నగరాలకు మార్చి 22 వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందే న్యూఢిల్లీ, ముంబై నుంచి జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన రెండు విమానాలు బ్రస్సెల్స్ చేరుకున్నాయి.

బ్రెస్సెల్స్ పేలుళ్ల నేపథ్యంలో దేశంలో అన్ని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్‌లలో హై ఎలర్ట్ ప్రకటించారు. భద్రతా దళాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోడీ సైతం బ్రస్సెల్స్ పేలుళ్లను ఖండించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్టు చేశారు.

English summary
There will be no change in Prime Minister Narendra Modi's scheduled visit to Belgian capital of Brussels on March 30 to attend the European Union summit, the government said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X