వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

150 రూపాయల కోసం మర్డర్ ... లాక్ డౌన్ వేళ దారుణం

|
Google Oneindia TeluguNews

రూ.150 ఒక స్నేహితుడి ప్రాణం తీసింది . కేవలం 150 రూపాయల కోసం తన స్నేహితుడిని హత్య చేశాడు ఒక వ్యక్తి. కరోనా లాక్ డౌన్ సమయంలో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన వివరాలు చూస్తే దక్షిణ ముంబైలో భూషణ్ షేక్ అలియాస్ చుల్‌బుల్‌, రియాజ్‌ షేక్‌ అనే ఇద్దరు స్నేహితులు. సౌత్‌ముంబైకి చెందిన వీరు, భౌచా దక్కా చేపల మార్కెట్‌లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే లాక్ డౌన్ తో పనుల్లేక ఇళ్లకే పరిమితం అయ్యారు .

థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?

లాక్‌డౌన్‌కి ముందు చుల్‌బుల్‌ నుంచి రియాజ్‌ రూ.150 అప్పుగా తీసుకున్నాడు. గత శుక్రవారం చుల్‌బుల్‌ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని రియాజ్‌ని అడిగాడు. దానికి రియాజ్‌ తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పాడు. చుల్‌బుల్‌ శనివారం ఉదయం మళ్లీ రియాజ్‌ ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన చుల్‌బుల్‌ రియాజ్ ను బండరాయితో బలంగా మోదాడు .

brutal murder for 150 rupees in lockdown time

రక్తపు మడుగులో పడిపోయిన రియాజ్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇక స్థానికులు హుటాహుటిన రియాజ్ ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. రియాజ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చుల్‌బుల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేవలం 150 రూపాయల కోసం ఇంత దారుణం జరిగిందంటే పరిస్థితి ఎలా మారుతుందో అర్ధం చేసుకోవచ్చు .

English summary
The young man killed his friend for Rs 150. The incident took place in south Mumbai on Saturday. Riyaz Sheikh, who was murdered by Bhushan Sheikh alias Chulbul,after he borrowed Rs 150. The two are friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X