బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుల రుణమాఫి సమావేశం: ఆహ్వానించినా హాజరుకాని యడ్యూరప్ప: ఎంత ప్రేమ, సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన రైతు రుణాలమాఫీ చర్చా సమావేశానికి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప డుమ్మా కొట్టారు. సీఎం కుమారస్వామి సమావేశానికి ఆహ్వానించినా యడ్యూరప్ప హాజరుకాలేదు. రైతుల మీద యడ్యూరప్పకు ఎంత ప్రేమ ఉందని కుమారస్వామి వ్యంగంగా అన్నారు.

భారీ వర్షాల దెబ్బ

భారీ వర్షాల దెబ్బ

కర్ణాటక కరావళి (కోస్తా ప్రాంతం)లో భారీ వర్షాలు పడటంతో ఆ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కరావళిలోని స్థానికులను పరామర్శించడానికి బీఎస్. యడ్యూరప్ప బుధవారం ఆ ప్రాంతాలకు వెళ్లారు. ఈ సందర్బంలో బీజేపీ సీనియర్ నాయకుడు గోవింద కారజోళ సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైనారు.

బీజేపీ వార్నింగ్

బీజేపీ వార్నింగ్

రైతుల రుణమామీ చెయ్యకుంటే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తానని బీఎస్. యడ్యూరప్ప శాసన సభలో సీఎం కుమారస్వామిని హెచ్చరించారు. సోమవారం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు రైతుల రుణమాఫీ చెయ్యాలని పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.

రైతుల మీద ఎంత ప్రేమ

రైతుల మీద ఎంత ప్రేమ

రైతుల రుణమాఫి విషయంలో చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి బీఎస్. యడ్యూరప్పను అహ్వానించామని సీఎం కుమారస్వామి మీడియాకు చెప్పారు. రైతుల మీద యడ్యూరప్పకు ప్రేమ ఉంటే ఆయనే సమావేశానికి స్వయంగా హాజరు అయ్యేవారని కుమారస్వామి అన్నారు.

బీజేపీకి నిర్లక్షం

బీజేపీకి నిర్లక్షం

యడ్యూరప్పతో పాటు బీజేపీకి రైతులు అంటే నిర్లక్షం అని, అందుకే ఆయన సమావేశానికి రాలేదని, ఇలా గోవింద కారజోళను పంపించారని కుమారస్వామి మండిపడ్డారు. బెంగళూరులోనే ఉన్న బీఎస్ యడ్యూరప్ప రైతు రుణాలమాఫీ విషయంపై జరిగే సమావేశానికి హాజరుకాకుండా మంగళూరు వెళ్లిపోవడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.

English summary
BJP state president BS Yeddyurappa absent to important meeting held in Vidhana Soudha about farmer's loan waive off. He was in Bengaluru itself but not attend the meeting. instead of him he sent BJP leader Govinda Karajola.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X