వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్ష నాయకుడిగా యడ్యూరప్ప, ఎంత కాలం ఉంటారో చూస్తాం, ఎమ్మెల్మేలా గొర్రెలా, చాన్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాసన సభ్యులు బెంగళూరులోని ప్రైవేటు హోటల్ లో సమావేశం అయ్యారు. కుమారస్వామి బలపరీక్ష సందర్బంలో అనుసరించాల్సిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు సుధీర్ఘంగా చర్చించారు. ఏ ఒక్క చాన్స్ చేతికి చిక్కినా వదిలిపెట్టకూడదని బీజేపీ నాయకులు నిర్ణయించారు. కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా బీఎస్. యడ్యూరప్ప ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గొర్రెల్లా చూస్తోందని బీజేపీ విమర్శించింది.

Recommended Video

కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష నెగ్గడం కష్టమే
సునీల్ కుమార్

సునీల్ కుమార్

కర్ణాటకలోని కార్కాళ బీజేపీ శాసన సభ్యుడు సునీల్ కుమార్ బీఎస్. యడ్యూరప్పను ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదించారు. కార్కాళ శాసన సభ్యుడు సునీల్ కుమార్ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా అమోదించడంతో బీఎస్. యడ్యూరప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక అయ్యారు.

ఎమ్మెల్యేలా గొర్రెలా

ఎమ్మెల్యేలా గొర్రెలా

ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే వారిని గొర్రెలను కట్టేసినట్లు హోటల్ లో ఒక చోట కట్టేశారని బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లే ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం శోభా కరందాజ్లే మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యేలను హోటల్ నుంచి ఎందుకు బయటకురానివ్వలేదని, వారి మీద నమ్మకం లేదా అని శోభా కరందాజ్లే ప్రశ్నించారు.

మా మీద నమ్మకంతో పోటీ

మా మీద నమ్మకంతో పోటీ

కర్ణాటకలో 104 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచిందని శోభా కరందాజ్లే అన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే నమ్మకంతో నే స్పీకర్ పదవికి జరుగుతున్న పోటీలో సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ ను నిలబెట్టామని, అందులో తప్పేముందని శోభా కరందాజ్లే అన్నారు.

వారిని పట్టించుకోం

వారిని పట్టించుకోం

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల గురించి, వారి ఎమ్మెల్యేల గురించి తాము పట్టించుకోమని శోభా కరందాజ్లే అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం అధికారంలో ఉంటుందో తాము చూస్తామని, ఈ ప్రభుత్వం త్వరలోనే పథనం అవుతోందని శోభా కరందాజ్లే జోస్యం చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యేలు

బీజేపీ ఎమ్మెల్యేలు

శుక్రవారం మద్యాహ్నం శాసన సభలో కుమారస్వామి బలపరీక్ష నిరూపించుకునే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యేలకు బీఎస్ యడ్యూరప్ప విప్ జారీ చేశారు. ఒక వేళ కుమారస్వామి బలపరీక్షలో క్రాస్ ఓటింగ్ జరిగితే దానిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
BS Yeddyurappa elected Leader of Opposition in Karnataka Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X