యడ్డీకి...సీఎం లైన్ క్లియర్ కాలేదా... ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న యడ్యూరప్ప...
కర్ణాటక సీఎం అభ్యర్ధిగా బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బీఎస్ యడ్యూరప్పకు ఇంకా లైన్ క్లియర్ కాలేదా... సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 48 గంటల్లోగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందించిన పార్టీ నేతలు...సీఎం ప్రమాణ స్వీకారాన్ని మరో రోజు ముందుకు సాగదీశారు. మరోవైపు ఢిల్లీ నుండి పిలుపు కోసం యడ్యూరప్ప వేచి చూస్తున్నానని ప్రకటించాడు. దీంతో యడ్యూరప్పకు ఢీల్లి ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు... ఢిల్లీ మదిలో ఇంకా ఎవరైనా ఉన్నారా...

సీఎంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న యడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరిన యడ్యూరప్ప గురువారమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ నేతలు సమాచారం అందించారు. ఇందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకున్నారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరమే ఓ ప్రైవేట్ హోటల్లో బీజేఎల్పీ సమావేశం కూడ ఏర్పాటు చేసుకుని యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

గురువారం నుండి శుక్రవారానికి మారిన సీఎం ప్రమాణ స్వీకారం
అయితే సీఎం ప్రమాణ స్వీకారం గురువారం కాకుండా శుక్రవారం చేస్తారని మరోసారి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమకు సహకరించినందుకు యడ్యూరప్ప గత రాత్రీ పార్టీ అధినేతకు కృతజ్ఝతలు తెలుపుతూ లేఖను పంపాడు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ నుండి యడ్యూరప్పకు ఎలాంటీ పిలుపు రాలేదు..మరోవైపు యడ్యూరప్ప రాష్ట్ర ఆర్ఎస్ఎస్ నేతలను ప్రసన్నం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఆదేశాల మేరకు ఎదురు చూస్తున్నానని ,పార్టీ ఆదేశాల అనంతరమే ,బీజేపీ శాసన సభ పక్షాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

గతంలో ఓసారి బలం నిరూపించుకోలేక పోయిన యడ్డీ...
కాగా యడ్యూరప్ప ఢిల్లి నేతల నుండి పిలుపు వచ్చిన తర్వాతే అమిత్ షాతోపాటు ఇతర పార్టీ పెద్దలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు. అయితే గతంలో కూడ యడ్యూరప్ప సభలో సరైన బలం లేకపోవడంతో రెండున్నర నెలల పాటు సీఎంగా కొనసాగిన యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోయింది. దీంతో యడ్యూరప్పపై ఇతర పార్టీ నేతలు వ్యతిరేకంగా ఉన్నారా... లేదంటే కేంద్రమే మరోసారి బీజేపీ ప్రభుత్వం పడిపోకుండా ఎమైనా ఎత్తుగడలు వేస్తుందా అనే చర్చ మొదలైంది.