వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప కొత్త స్ట్రాటజీ: సిద్దరామయ్యపై సానుభూతి, అసలు కారణమదే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎప్పుడూ సిద్దరామయ్యపై విమర్శనాస్త్రాలు సంధించే మాజీ సీఎం యడ్యూరప్ప అనూహ్యంగా తన స్ట్రాటజీ మార్చారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ సీఎం సిద్దరామయ్య పరిస్థితి తీసికట్టుగా తయారైందంటూ ఆయనపై జాలి కురిపించారు.

బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వేళ.. బీజేపీ నేతలు 'బ్లాక్ డే' పాటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ సిద్దరామయ్యపై సానుభూతి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

BS Yeddyurappa stirs pot praises Siddaramaiah

సిద్దరామయ్య.. ఆయన వెనకాల ఉన్న కురుబ సామాజిక వర్గం వల్లే కాంగ్రెస్ పార్టీకి 78సీట్లు వచ్చాయని యడ్యూరప్ప అన్నారు. పార్టీ కోసం అంత చేస్తే సిద్దరామయ్యను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, ఆయన సామాజిక వర్గమైన కురుబలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

యడ్యూరప్ప స్ట్రాటజీ అదే:

నిన్న మొన్నటిదాకా ఎన్నికల ప్రచారంలో ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డ సిద్దరామయ్యపై యడ్యూరప్పకు ఇప్పుడే ఇంత సానుభూతి ఎందుకు పుట్టుకొచ్చింది?.. దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఒకటి సిద్దరామయ్యను తాను ప్రశంసించడం ద్వారా పార్టీలో ఆయన పట్ల అనుమానాలు కలిగించడం, రెండు సిద్దరామయ్య సామాజిక వర్గమైన 'కురుబ'ల మెప్పు పొందడం.. ఈ కారణంగానే యడ్యూరప్ప సిద్దరామయ్యపై ఎన్నడూ లేని సానుభూతి చూపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీకి మధ్య అగాథం సృష్టిస్తే అంతిమంగా అది బీజేపీకి మేలు చేస్తుందని యడ్యూరప్ప భావిస్తున్నారు. కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలను బహిరంగంగానే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఇక కుమారస్వామి ప్రమాణస్వీకారం వేళ.. విపక్షాలన్ని ఒకే వేదిక పైకి రావడంపై కూడా యడ్యూరప్ప స్పందించారు. మోడీకి వ్యతిరేకంగా వాళ్లెంత ప్రచారం చేసినా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28ఎంపీ స్థానాలను బీజేపీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య స్నేహం మూడు నెలల ముచ్చటే అని యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే.. బీజేపీ 130సీట్లు సాధిస్తుందని తెలిపారు. జేడీఎస్ కు అధికారాన్ని కట్టబెట్టడం పట్ల కాంగ్రెస్ పార్టీలోని 90శాతం నేతలు అసంతృప్తితో ఉన్నారని యడ్యూరప్ప చెప్పుకొచ్చారు.

ఒకవేళ సీఎం కుమారస్వామి రైతు రుణాలను మాఫీ చేయకపోతే... లక్షలాది మంది రైతులను ఏకం చేసి కర్ణాటక బంద్ కు పిలుపునిస్తామని చెప్పారు.

English summary
In a surprising change of heart, state BJP chief, B.S.Yeddyurappa turned advocate for former Chief Minister, Siddaramaiah on Wednesday, claiming he had been ditched by the Congress high command although he had single- handedly ensured the victory of 78 of its MLAs with the support of his Kuruba community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X