వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి డైలాగ్‘సత్యమేవ జయతే’రిపీట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, శివమొగ్గ ఎంపీ (బీజేపీ) బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ క్లిన్ చిట్ ఇచ్చిన వెంటనే ఆయన సిటీ సివిల్ కోర్టు ఆవరణంలోని తన కారు దగ్గరకు వెళ్లారు. తరువాత మీడియాను చూసిన ఆయన 'సత్యమేవ జయతే'అన్నారు.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల కేసులో మూడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. తరువాత గాలి జనార్దన్ రెడ్డికి గత సంవత్సరం షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పిన మొదటి మాట సత్యమేవ జయతే.

రాజకీయ కక్షతోనే తన మీద తప్పుడు కేసులు పెట్టారని అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు యడ్యూరప్ప ఇదే మాట చెప్పారు. తాను రాజకీయంగా పైకి రావడం ఇష్టం లేని కొందరు తన మీద, మా కుటుంబ సభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు.

తనకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందని, ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నానని యడ్యూరప్ప చెప్పారు. నేను కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, నాయకులు, పార్టీ కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.

BS. Yeddyurappa

జిందాల్ స్టీల్ వర్క్స్, సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీలకు గనులు లీజుకు ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్. యడ్యూరప్ప తన కుటుంబ సభ్యులకు చెందిన ప్రేరణా ట్రస్ట్, ధవళగిరి ప్రాపర్టీ డెవలపర్స్, భగత్ హోం కంపెనీకు రూ. 40 కోట్లు (లంచం) తీసుకున్నారని ఆరోపణలు రావడంతో 2012లో సీబీఐ కేసు నమోదు చేసింది.

యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాలి సోదరులు ఓ వెలుగు వెలిగిపోయారు. గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి మంత్రులుగా పని చేశారు. గాలి ప్రాణ మిత్రుడు బి. శ్రీరాములు సైతం మంత్రిగా పని చేశారు. మాజీ సీఎం యడ్యూరప్ప గాలి సోదరులకు సన్నిహితుడని అందరూ అంటుంటారు.

English summary
Satyameva Jayate is what B S Yeddyurappa had to say after being acquitted in the Rs 40 crore bribery case. Justice is done, I stand vindicated. Thanks to all my well wishers, friends and supporters who stood by me in these tough times, Yeddyurappa the former Karnataka Chief Minister and state BJP president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X