వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: అయ్యో యడ్డీ..? ఇదేందీ.. సలహాలు చెప్పేందుకేనా.. 2 వేల మందితో కలిసి పెళ్లికి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రక్కసి మరణమృదంగం మోగిస్తోంది. రోజురోజుకు వైరస్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు, పబ్‌లు, బార్లను మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా చిలకపలుకులు పలికారు. కానీ 48 గంటలు గడిచిందో లేదో మాట మరచిపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 2 వేల మందితో కలిసి పెళ్లికి హాజరయ్యారు. యడ్డీ తాజా చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయ్యో యడ్డీ..

అయ్యో యడ్డీ..

ఆదివారం బెలగావిలో ఎమ్మెల్సీ మహంతిస్ కూతురు వివాహ మహోత్సవం జరిగింది. ప్రజా ప్రతినిధి కదా.. వివాహాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ కూతురు పెళ్లికి సీఎం వెళ్లకుండా ఉంటారు. మందీ మార్బాలాన్ని వెంటేసుకొని వెళ్లారు. సీఎం యడియూరప్ప సహా హోంమంత్రి బసవరాజు బొమ్మై, ఎంపీలు, ఇతర నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 2 వేల మందితో వివాహా వేడుక కళకళలాడింది. కానీ కరోనా వైరస్ గురించి సీఎం యడియూరప్ప చెప్పిన స్టేట్‌మెంట్ మాత్ర మరచిపోయారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

వద్దనుకొని..

వద్దనుకొని..

వాస్తవానికి వివాహానికి హాజరుకావొద్దని సీఎం యడియూరప్ప అనుకొన్నారు. కానీ ఎమ్మెల్సీ భావోద్వేగంతో పిలువడం, నేత పరువు ప్రతిష్టకు సంబధించిన అంశమైనందున.. సీఎం వెళ్లాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం 11.15 గంటలకు బెలగవి వెళ్లిన సీఎం వధూవరులను ఆశీర్వదించారు.

శుక్రవారం పిలుపు

శుక్రవారం పిలుపు


పెళ్లిళ్లు, పార్టీలు, టోర్నమెంట్లు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోటకు వెళ్లొద్దని శుక్రవారం యడియూరప్ప ప్రజలను కోరారు. కానీ ఆదివారం రోజు 2 వేల మంది హాజరైన పెళ్లికి హాజరై.. తాను ఇచ్చిన పిలుపునే మరచిపోయారు.

డీకే కూడా..

డీకే కూడా..

ఇదేకాదు కర్ణాటక పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్‌కు కూడా అభిమానులు ఘన స్వాగతం పలికారు. పదుల సంఖ్య కార్యకర్తలు, అభిమానులు కనిపించారు. కానీ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మాత్రం కరోనా వైరస్‌పై పదే పదే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
Karnataka Chief Minister BS Yediyurappa himself turned up at a pretty big one in Belagavi on Sunday. Around 2,000 people were in attendance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X