• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నాళ్లకెన్నాళ్లకు .. యడ్డీ మంత్రివర్గానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

|

బెంగళూరు : కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కావస్తోన్న మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు. ఇప్పటికే నాలుగుసార్లు క్యాబినెట్ సమావేశాన్ని సీఎం యడియూరప్పే నిర్వహించారు. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీ పెద్దలతో ఎడతెగని మంతనాలు జరుపుతున్నారు యడియూరప్ప. ఈ మేరకు ఆయనకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం క్యాబినెట్ విస్తరణ ఉంటుందని యడియూరప్ప సంకేతాలు ఇచ్చారు.

 మంత్రివర్గం లేని ..

మంత్రివర్గం లేని ..

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి ముగిసిన తర్వాత గత నెల 26న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు యడియూరప్ప. కానీ తన మంత్రివర్గాన్ని మాత్రం నియమించుకోలేదు. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. అయితే సమయం గడిచిపోవడంతో ... మంత్రివర్గ విస్తరణ చేయాలని హై కమాండ్ వద్ద ప్రస్తావిస్తూ వచ్చారు. ఆదివారం ఢిల్లీలో అమిత్ షాతో కలిసి మంత్రివర్గ విస్తరణపై హామీ తీసుకున్నట్టు మీడియాకు తెలిపారు యడియూరప్ప. ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ వెళ్లొచ్చిన యడియూరప్ప .. ఈ నెల 17న అమిత్ షాతో కలిసాక మంత్రివర్గ విస్తరణపై ఓ స్పష్టత వచ్చింది.

 ఎట్టకేలకు ఆమోదం ..

ఎట్టకేలకు ఆమోదం ..

తన మంత్రివర్గ సహచరుల జాబితాతో ఢిల్లీవెళ్లారు యడియూరప్ప. ఆ లిస్ట్‌ను అమిత్ షాకు అందజేస్తానని .. అందుల్లోంచి అమిత్ షా సూచించే వారితో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం మంత్రివర్గ విస్తరణ తప్పనిసరి అని తేల్చిచెప్పారు. అయితే మంత్రివర్గ పదవులు మాత్రం హైకమాండ్ సూచించిన వారితోనే భర్తీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే మంత్రివర్గంలో కొన్ని బెర్తులను మాత్రం అలాగే వదిలేస్తారు. మిగతా వాటిని బీజేపీ సీనియర్ నేతలకు అప్పగిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేందుకు సహకరించిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. అయితే వారిని స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. దీనిని వారు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై సుప్రీంకోర్టు విచారణ జరిపి .. అనుకూలంగా తీర్పు వస్తే వారికి క్యాబినెట్‌లో చోటు లభిస్తోంది. లేదంటే మిగతావారితో ఆ పదవులను భర్తీ చేస్తారు.

వరదలతో మరో 10 రోజులు

వరదలతో మరో 10 రోజులు

మరోవైపు కర్ణాటకలో వరదలు కూడా మంత్రివర్గ విస్తరణపై ప్రభావం చూపింది. గత 10 రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాలతో వరద సహాయక పరిస్థితుల్లోనే సీఎం మునిగిపోయారు. మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేయడానికి వీలులేకుండా పోయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కూడా చేసింది. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రులే లేరని .. బీజేపీ మిన్స్ మినిమం గవర్నమెంట్ అని పొడిచారు. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే .. మంత్రివర్గం లేని ప్రభుత్వం కొలువుదీరింది అని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ విమర్శించారు. ఇక్కడ క్యాబినెట్ లేదు, బీజేపీ హైమాండ్ నిద్రపోతుంటుంది, సీరియస్ అంశాలను సీఎం పట్టించుకోరు అని మండిపడ్డారు.

English summary
karnataka is likely to have a full-fledged cabinet soon. According to BJP sources, the ministers will be sworn-in at the Raj Bhavan’s Glass house premises on Tuesday morning.BS Yediyurappa took oath as the Chief Minister of Karnataka on July 26 but since then, he has been the one and only minister in his cabinet. The decision was not in his hands. In fact, Yediyurappa made several visits to BJP headquarters in the last few days, but in vain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X