వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించలేదని నడిరోడ్డులో బీఎస్సీ విద్యార్థిని కసితీర పొడిచి చంపేశాడు, వన్ సైడ్ లవ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తన ప్రేమను అంగీకరించలేదని బీఎస్సీ విద్యార్థిని సాటి విద్యార్థి నడిరోడ్డు అతిదారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోి దక్షిణ కన్నడ జిల్లాలోని సుళ్య నగరంలో జరిగింది. అక్షితా అనే విద్యార్థిని సాటి విద్యార్థి కార్తీక్ మంగళవారం నడిరోడ్డులో అతికిరాతంగా పొడిచి చంపేశాడు.

ఒకే కాలేజ్

ఒకే కాలేజ్

దక్షిణ కన్నడ జిల్లా సుళ్య నగరంలోని నెహ్రూ మెమోరియల్ కాలేజ్ లో అక్షితా, కార్తిక్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నారు. అక్షితాను కార్తీక్ ప్రేమిస్తున్నాడు. అయితే అక్షితా మాత్రం కార్తీక్ ను ప్రేమించడం లేదని సమాచారం.

కాలేజ్ లో ఒత్తిడి

కాలేజ్ లో ఒత్తిడి

మంగళవారం అక్షితా, కార్తీక్ ఇద్దరూ కాలేజ్ కు వెళ్లారు. ఆ సందర్బంలో తనను ప్రేమించాలని కార్తీక్ అక్షితా మీద ఒత్తిడి చేశాడు. తాను ఇంటిలో పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటానని, పెద్దలను ఎదిరించి తాను ఏ పని చెయ్యేలేనని అక్షితా తేల్చి చెప్పింది.

అడ్డగించాడు

అడ్డగించాడు

మంగళవారం కాలేజ్ పూర్తి అయిన తరువాత అక్షితా ఇంటికి బయలుదేరింది. సుళ్య నగరంలోని చెన్నకేశ్వర రథవీధిలోని అక్షితా నడుచుకుని వెలుతున్న సమయంలో కార్తీక్ ఆమెను అడ్డగించాడు. ఆ సందర్బంలో అక్షితా, కార్తీక్ మధ్య మాటామాటా పెరిగింది.

కసితీరా కత్తితో పొడిచాడు

కసితీరా కత్తితో పొడిచాడు

అక్షితా తనను ప్రేమించలేదని కార్తీక్ సహనం కోల్పోయాడు. నడిరోడ్డులో అక్షితా మీద దాడి చేశాడు. తరువాత వెంట తీసుకెళ్లిన కత్తితో అక్షితాను కసితీరా ఆరు సార్లు పొడిచాడు. అక్షితా మీద దాడి చేసిన కార్తీక్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

కార్తీక్ కు దేహశుద్ది

కార్తీక్ కు దేహశుద్ది

పారిపోవడానికి ప్రయత్నించిన కార్తీక్ ను వెంబడించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. అక్షితాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. కార్తీక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Sullia Nehru memorial college 2nd year BSC student Akshta murdered by her classmate Karthik in Sullia, Dakshina Kannada on February 20, 2018. Sullia police arrested Karthik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X