వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకెళ్లిన బీఎస్ఈ.. ఎన్ఎస్ఈలో లిస్ట్..

ఇష్యూ ధర రూ.806కు 34.62శాతం ప్రీమియంతో రూ,1085కు షేర్లు జంప్ అయ్యాయి. 5-15శాతం ప్రీమియంతో బీఎస్ఈ స్టాక్ లిస్టవుతుందని విశ్లేషకులు అంచనా వేయగా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీఎస్ఈ(ముంబై స్టాక్ ఎక్స్ చేంజ్) చరిత్ర సృష్టించింది. ఆసియాలోనే అతి పురాతన ఎక్స్ చేంజ్‌గా, దేశంలో రెండో అతి పెద్ద స్టాక్ ఎక్స్ చేంజ్‌గా పేరుగాంచిన బీఎస్ఈ.. శుక్రవారం నాడు గణనీయంగా తన వృద్దిరేటును మెరుగుపరుచుకుంది.

దీంతో తన ప్రత్యర్థి ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్) జాబితాలో బ్లాక్ బస్టర్ హిట్ తో చోటు దక్కించుకుంది. ఇష్యూ ధర రూ.806కు 34.62శాతం ప్రీమియంతో రూ,1085కు షేర్లు జంప్ అయ్యాయి. 5-15శాతం ప్రీమియంతో బీఎస్ఈ స్టాక్ లిస్టవుతుందని విశ్లేషకులు అంచనా వేయగా.. ప్రస్తుతం భారత్ లో లిస్టవుతున్న మొట్టమొదటి స్టాక్ ఎక్స్ చేంజ్ ఇదే కావడం విశేషం.

కాగా, జనవరి 23న తొలిసారి ఐపీఓకు వచ్చిన బీఎస్ఈకి మూడు రోజుల బిడ్డింగ్ లో చివరిరోజు బంపర్ డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 51రెట్ల సబ్ స్క్రిప్షన్ ను బీఎస్ఈ సొంతం చేసుకుంది.

BSE creates history! Exchange lists at Rs 1,085, 34.62% premium over issue price

అదే ఊపుతో ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ తో ఎన్ఎస్ఈ మార్కెట్ లో లిస్టయింది. ప్రస్తుతం అన్ని సెగ్మెంట్స్ లో కలిపి బీఎస్ఈకి 1440యూనిక్ మెంబర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసియాలో అతి పురాతన ఎక్స్ చేంజ్ గా పేరుగాంచిన బీఎస్ఈ 1875, జూలై 9న ఏర్పాటైంది.

తర్వాతి కాలంలో 2016, జూలై 30వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ చేంజ్ ల్లో ఒకటిగా బీఎస్ఈ నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్ చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52ట్రిలియన్ డాలర్లు.

English summary
Asia’s oldest stock exchange BSE created history on Friday, as its shares got listed at a 34.62 per cent premium on rival NSE at Rs 1,085 compared with an issue price of Rs 806.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X