వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200కంపెనీలు డీలిస్ట్!: ఆర్నెళ్ల పాటు ట్రేడింగ్ రద్దు చేసిన బీఎస్ఈ

|
Google Oneindia TeluguNews

Recommended Video

200 కంపెనీలను డీలిస్ట్ చేసిన బీఎస్ఈ

ముంబై: అక్రమ పద్దతుల్లో ఫండ్స్ తీసుకొస్తున్నారన్న కారణంగా దేశీయ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బీఎస్‌ఈ 200 కంపెనీలపై వేటు వేసింది. ఈ మేరకు మే 11 నుంచి వీటిని బీఎస్ఈ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు(డీలిస్ట్) ప్రకటించింది.

డీలిస్ట్ లో ఉన్న కంపెనీలు ఆర్నెళ్ల పాటు షేర్ల ట్రేడింగ్ జరపకుండా బీఎస్ఈ రద్దు చేసింది. అక్రమ ఫండ్స్ ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టింది. కాగా, గతేడాది ఆగస్టులోనే సెబీ 331 డొల్ల కంపెనీలను గుర్తించి, వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్‌లను ఆదేశించింది.

BSE to delist over 200 companies from 11 May

ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ 200కంపెనీలపై వేటు వేయగా.. అటు ప్రభుత్వం సైతం చాలా కాలంగా కార్యకలాపాలు సాగించని 2లక్షలకు పైగా సంస్థలను డీరిజిస్టర్ చేసింది. ఈ మేరకు రెండు సర్క్యులర్లను బీఎస్ఈ జారీ చేసింది. 188కంపెనీల ట్రేడింగ్ నిలిపివేస్తున్నామని, మే 11నుంచి వాటిని తమ ప్లాట్ ఫామ్ పై నుంచి డీలిస్ట్ చేస్తామని ఒక సర్క్యులర్ లో బీఎస్ఈ పేర్కొంది.

మరొక సర్క్యులర్ లో మరో 14సంస్థలను కూడా ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్లాట్ ఫామ్ నుంచి కంపల్సరీ డీలిస్ట్ అయిన పూర్తి కాలపు డైరెక్టర్లు, ప్రమోటర్లను, గ్రూప్‌ సంస్థను మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించకుండా 10ఏళ్ల పాటు రద్దు చేయనుంది.

English summary
The BSE move comes at a time when authorities are clamping down on shell companies —listed as well as unlisted — for being allegedly used as conduits for illicit fund flows
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X