వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ప్రతీకారం: నాలుగు పాక్ పోస్టులు ధ్వంసం... 25 మంది పాక్ రేంజర్ల హతం..!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘించి జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్ రేంజర్లును కోలుకోలేని దెబ్బ తీసింది.

పాక్ రేంజర్లు గురువారం నుంచి కాల్పులు జరుపుతూనే ఉన్నారు. శుక్రవారం కూడా ఈ కాల్పులు కొనసాగాయి. పాక్ రేంజర్లు యథేచ్ఛగా సాగిస్తున్న కాల్పుల్లో గాయపడిన బీఎస్‌ఎస్ జవాన్, హెడ్ కానిస్టేబుల్ సురేష్‌తోపాటు మరో ఇద్దరు పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో ఒక యువతి కూడా ఉంది.

BSF Avengers Jawans Death, Destroys 4 Pakistan Posts, 25 Pak Rangers Dead

ఈ కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడి చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆర్ఎస్‌ పుర, అర్నియా సెక్టార్లలో కూడా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరుపుతుండటంతో బీఎస్‌ఎఫ్ దళాలు ధీటుగా జవాబిస్తున్నాయి.

మరో నాలుగు పాకిస్తాన్ మోర్టార్ పొజిషన్లను బీఎస్ఎఫ్ ధ్వంసం చేసిందని, దీంతో పాక్ వైపు మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.

కుందన్‌పూర్, గద్యాల్, హరియా, జగ్వాల్‌లోని పాక్ పోస్టులు ధ్వంసమైనట్టు బీఎస్ఎఫ్ గుర్తించింది. పాకిస్తాన్ వైపు పలు అంబులెన్సులు వెళ్తున్నాయని, దీంతో అటువైపు మృతుల సంఖ్య 20 నుంచి 25 వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.

English summary
Two civilians were killed and three others injured after Pakistani troops resumed shelling and firing on Indian posts and villages along the international Border in RS Pura, Arnia, Chadwal and Ramgarh sectors of Jammu for the second consecutive day, a Border Security Force (BSF) officer said. Four civilians were killed when Pakistani troops opened fire along the International Border in Jammu. The ceasefire violation took place at Jammu & Kashmir's RS Pura sector. Pakistan Rangers heavily shelled civilian areas and Border Out Posts for the second consecutive day today along the IB in Jammu and Samba districts. BSF troops effectively retaliated. "Pakistan Rangers resorted to heavy firing and shelling along the IB in several areas in R S Pura, Arnia and Ramgarh sectors since 0640 hours", a BSF officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X