వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు వెంబడి భారీ సొరంగాలు -ఉగ్ర పాకిస్తాన్ దుష్టపన్నాగం - ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదంపై పోరాటంలో భాగస్వామిగా ఉంటానంటూనే స్వదేశంలో ఉగ్ర నేతలకు ఆశ్రయం కల్పిస్తోన్న పాకిస్తాన్ తీరుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఎండగట్టిన కొద్ది గంటలకే పాక్ దుష్టపన్నాగం మరోటి బయటపడింది.

షాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారంషాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారం

భారత్ లోకి ఉగ్రవాదులను పంపించడమే లక్ష్యంగా సరిహద్దుల్లో సొరంగాలను పాకిస్తాన్ నిర్మిస్తోందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పేర్కొంది. నైపుణ్యంతో కూడిన ఇంజినీరింగ్ టెక్నిక్స్‌తో ఈ సొరంగాలను ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ నిర్మిస్తోందని, జమ్మూ-కశ్మీరులోని కథువా, సాంబా జిల్లాల్లో వీటిని గుర్తించామని తెలిపింది.

BSF detects tunnel along IB with Pakistan - second tunnel in JK in 2 months

బీఎస్ఎఫ్ జమ్మూ ఫ్రాంటియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జమ్వాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ బోర్డర్(ఐబీ) వెంబడి కథువా జిల్లా, హీరానగర్ సెక్టర్‌లో ఓ సొరంగాన్ని గుర్తించినట్లు తెలిపారు. దీని పొడవు 150 మీటర్లని తెలిపారు. ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఈ సొరంగాన్ని నిర్మించినట్లు తెలిపారు.

బైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలోబైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలో

టెర్రర్ కలాపాల కోసమే పాక్ ఈ సొరంగాలను నిర్మిస్తోందని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు. దీనిని గడచిన కొద్ది రోజుల్లో ఉపయోగించినట్లు కనిపించలేదన్నారు. గత కొన్ని నెలల్లో తాము దాదాపు 10 సొరంగాలను గుర్తించామని చెప్పారు. కథువా జిల్లాలో రెండు, మూడు సొరంగాలను గుర్తించామన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు హీరానగర్ సెక్టర్‌లోని బొబియా బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్ ప్రాంతంలో ఓ సొరంగాన్ని గుర్తించినట్లు తెలిపారు. యాంటీ టన్నెలింగ్ పార్టీ దీనిని గుర్తించిందన్నారు. జీరో లైన్ నుంచి సుమారు 90 మీటర్ల దూరంలో, మన వైపున ఉన్న కంచె నుంచి 20 మీటర్ల దూరంలో దీనిని గుర్తించినట్లు చెప్పారు. భారత దేశం వైపు బయట దారిని పాకిస్థాన్‌లో తయారైన ఇసుక బస్తాలతో మూసివేశారని తెలిపారు.

English summary
The Border Security Force (BSF) has detected a tunnel along the International Border in Hiranagar sector of Kathua in Jammu and Kashmir.The tunnel was detected by BSF troops in Bobiyaan village during an operation this morning in Samba district of Jammu division on Wednesday (January 13, 2021).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X