వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ తో సంబంధమని వేధిస్తున్నారు: తేజ్ బహదూర్ సంచలనం

ఆహరం నాణ్యంగా లేదని వీడియో పోస్టు చేసి దేశం దృష్టిని తన వైపుకు తిప్పుకొన్న బిఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తాజాగా మరో వీడియోను పోస్టు చేశారు. అయితే తనకు పాకిస్తాన్ కు సంబందాలు అంటగట్టేందుకు ప్రయత్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:జవాన్లకు పెట్టే ఆహరంలో నాణ్యత లేదని వీడియో పోస్టు పెట్టి దేశం దృష్టిని తన వైపుకు మరల్చుకొన్న బిఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తాజాగా మరో వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.తాజాగా పోస్టు చేసిన లేఖలో తనకు పాక్ కు సంబంధం ఉందనే ఆరోపణలను సృష్టించేందుకుగాను అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆ వీడియోలో ఆరోపించాడు.

సరిహద్దులో దేశ రక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్లకు అందిస్తోన్న ఆహరం నాణ్యంగా లేదని దేశం దృష్టికి తీసుకువచ్చిన బిఎస్ఎస్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు.

తేజ్ బహదూర్ వీడియోలు దేశ వ్యాప్తంగా బిఎస్ ఎప్ లో చోటుచేసుకొన్న పరిణామాలను బహిర్గతం చేశాడు తేజ్ బహదూర్ . ఈ వీడియో పెద్ద దుమారాన్ని రేపింది.

తేజ్ బహదూర్ ఫేస్ బుక్ లో వీడియో పోస్టు చేయడంతో ఆయనను జమ్మూ కాశ్మీర్ సెక్టార్ కు మార్చారు. అయితే తన భర్త ఆచూకీ కోసం ఆయన భార్య షర్మిల డిల్లీ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశం మేరకు ఆమె ఎట్టకేలకు భర్తను కలిసింది.

'పాకిస్తాన్ తో సంబంధాలు అంటగడుతున్నారు'

'పాకిస్తాన్ తో సంబంధాలు అంటగడుతున్నారు'

పాకిస్తాన్ తో తనకు సంబంధాలను తన పై అధికారులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బిఎస్ ఎప్ జవాన్ తేజ్ బహదూర్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో లో ఆరోపించాడు.


స్వరాజ్ సమాచార్ అనే ఫేస్ బుక్ పేజీలో తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో కూడ తనను ఉన్నతాధికారులు ఏ రకంగా వేధిస్తున్నారో అనే విషయాన్ని ఆయన వెల్లడించారు.పాకిస్తాన్ తో తనకు సంబంధాలున్నాయనే ఉన్నతాధికారులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

' నా ఫోన్ ను పగులగొట్టారు'

' నా ఫోన్ ను పగులగొట్టారు'

తన మొబైల్ ఫోన్ ను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకొన్నారని, ఈ ఫోన్ ను పగులగొట్టారని ఆయన ఆరోపించారు. తనను మానసికంగా హింసిస్తున్నారని తేజ్ బహదూర్ ఆరోపించాడు.


తన పోన్ ను తప్పుడు పనులకు ఉపయోగించానని చెబుతున్నారని ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నట్టుగా తనకు తెలిసిందని ఆయన ఆరోపించారు. అయితే ఆహరం నాణ్యంగా ఉండదనే విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళేందుకే తాను ఫేస్ బుక్ లో వీడియోను పోస్టు చేసినట్టు చెప్పారు.

'రక్షణ శాఖలో అవినీతిని బయటపెట్టేందుకే నా ప్రయత్నం'

'రక్షణ శాఖలో అవినీతిని బయటపెట్టేందుకే నా ప్రయత్నం'

అవినీతిని అంతం చేయడానికి ప్రధాన మంత్రి మోడీ ప్రయత్నిస్తున్నాడని తేజ్ బహదూర్ చెప్పారు.


రక్షణ శాఖలో చోటుచేసుకొన్న అవినీతిని అంతం చేసేందుకు గాను తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.తన ఫోన్ ను టాంపరింగ్ చేస్తున్నారని చెప్పారు.తనకు పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని నిరూపించేందుకుగాను ఫోన్ లో ఏవో అంశాలు జోడిస్తున్నారని ఆయన ఆరోపించారు.

'తేజ్ బహదూర్ వద్ద ఫోన్ లేదు'

'తేజ్ బహదూర్ వద్ద ఫోన్ లేదు'

తేజ్ బహదూర్ ఫిబ్రవరి మూడో వారంలో రికార్డు చేసి ఉంటారని బిఎస్ ఎప్ అధికారులు చెబుతున్నారు.


అందులో ఉన్నది తేజ్ బహదూరేనని బిఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. తేజ్ బహదూర్ యాదవ్ వద్దకు వెళ్ళిన సమయంలో ఆయన భార్య షర్మిల రికార్డుచేసి ఉండవచ్చని బిఎస్ ఎప్ అధికారులుఅభిప్రాయపడుతున్నారు.


తేజ్ బహదూర్ వద్ద ఉన్న ఫోన్ ను తీసుకొన్నట్టుగా బిఎస్ఎప్ అధికారులు చెప్పారు.తేజ్ బహదూర్ ఫేస్ బుక్ పేజీలో కొంతమంది పాకిస్తాన్ స్నేహితులు ఉన్నారని బిఎస్ఎప్ అధికారులు చెప్పారు. వారి ప్రభావం తేజ్ బహదూర్ పై పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
BSF Jawan Tej Bahadur posted latest video on face book .“I have got to know that my phone has been misused. I want to let the Prime Minister know that my video about poor quality food being given to soldiers was real... Now, I am being mentally tortured,” he says in the video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X