వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేజ్ బహదూర్ ను అరెస్టు చేయలేదు, బెటాలియన్ ను మార్చాం

తమకు సరైన ఆహరం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసిన బిఎస్ ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను వేరే యూనిట్ కు తరలించినట్టుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.తేజ్ బహదూర్ యాదవ్ భార్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసి సైనికులకు పెట్టే భోజనంపై చర్చకు కారణమై, బిఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.అవసరాల రీత్యా ఆయనను వేరే చోటుకు బదిలీ చేసినట్టు డిల్లీ కోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివరించింది.

గత మూడు రోజులుగా తన భర్త జాడ కన్పించడం లేదంటూ ఆయనను కలిసేందుకు కూడ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆయన తేజ్ బహదూర్ యాదవ్ భార్య షర్మిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సంబంధిత అధికారులను ప్రశ్నించింది.

తేజ్ బహదూర్ యాదవ్ సతీమణి షర్మిళను భర్తను ఎందుకు కలుసుకోకుండా అడ్డుకొంటున్నారని కోర్టు ప్రశ్నించింది.కొత్త బెటాలియన్ క్యాంప్ వీకెండ్ లో ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

BSF Jawan Tej Bahadur not arrested, but shifted to another battalion

ప్రస్తుతం సాంబా సెక్టార్ లోని 88వ, బెటాలియన్ లో తేజ్ బహదూర్ యాదవ్ పనిచేస్తున్నట్టు హోంమంత్రిత్వశాఖ కోర్టుకు తెలిపింది.భోజనం సరిగా పెట్టడం లేదంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అధికారులు తన భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని షర్మిల ఆరోపించింది.

తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసి సైనికులకు పెట్టే భోజనంపై చర్చకు కారణమై, బిఎస్ఎప్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.అవసరాల రీత్యా ఆయనను వేరే చోటుకు బదిలీ చేసినట్టు డిల్లీ కోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివరించింది.

English summary
The Ministry of Home Affairs on Friday conveyed to the Delhi High Court, that Border Security Force (BSF) soldier Tej Bahadur Yadav, whose video complaint about bad food at his unit triggered a row, had not been arrested but moved to another Unit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X