వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ డ్రగ్స్ స్మగర్లు హతం

|
Google Oneindia TeluguNews

ఛండీఘర్: పంజాబ్ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల కేంద్రంగా మారుతోంది. కాగా, పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఉదయం స్మగ్లర్లపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.

పాక్‌ స్మగ్లర్ల నుంచి మాదకద్రవ్యాలను తీసుకునేందుకు వీరంతా ఖేమ్‌కరణ్‌ సెక్టార్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు భారత్‌ చెందినవారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి 10కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

BSF kills 4 drug smugglers in Punjab; 2 Pakistani among the eliminated miscreants

ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ.. భద్రతా సిబ్బంది గస్తీ ముమ్మరం చేశారు.

సరిహద్దు ప్రాంతమంతా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పఠాన్‌కోట్ దాడి సయంలోనూ పోలీసులు.. నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
Over the years, Punjab has turned into a hub of narcotic substances. Drugs are smuggled into the state from across the border. Despite several programmes initiated by the Punjab Police and BSF to curb the drug flow, loopholes in the international border could not be plunged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X