వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు : పెళ్లి కావాల్సిన ఆ జవాన్ ఇల్లు తగలబడింది.. మానవత్వం చాటుకున్న బీఎస్ఎఫ్..

|
Google Oneindia TeluguNews

ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి కాస్‌లో అల్లరిమూకలు తగలబెట్టిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్(29) ఇంటిని తాము పునర్నిర్మిస్తామని బీఎస్ఎఫ్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు అనీస్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(DIG) పుష్పేంద్ర రాథోర్ వారికి హామీ ఇచ్చారు. కాలిబూడిదైన ఆ ఇంటిని తిరిగి నిర్మించి.. అనీస్ పెళ్లి కానుకగా ఇస్తామని చెప్పారు.

బీఎస్ఎఫ్ జవాన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని.. బీఎస్ఎఫ్ ఇంజనీరింగ్ విభాగం పక్షం రోజుల్లోనే ఇంటిని పునర్నిర్మిస్తుందని తెలిపారు.అంతేకాదు,ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో పనిచేస్తున్న అనీస్‌ను అతి త్వరలోనే ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పారు. తద్వారా కుటుంబంతో పాటు ఉండి పెళ్లి పనులు చూసుకునేందుకు అవకాశం చిక్కుతుందన్నారు.

అనీస్ పెళ్లి కంటే ముందే ఇంటిని పునర్నిర్మిస్తామన్న నమ్మకం ఉందని రాథోర్ తెలిపారు. బీఎస్ఎఫ్ అనేది ఒక కుటుంబం లాంటిదని.. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా.. అసవరమైన అన్ని వనరులను ఉపయోగించుకుంటామని చెప్పారు.

BSF to Rebuild Jawan Mohd Anees home which burnt in delhi riots

అనీస్ కుటుంబానికి ఇంకా ఏదైనా సాయం కావాలన్నా తమను అడగాల్సిందిగా చెప్పామన్నారు. కాగా,2013లో బీఎస్ఎఫ్‌లో చేరిన అనీస్.. తన ఇల్లు కాలిపోయిన విషయాన్ని అధికారులతో చెప్పలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్ఎఫ్ చేస్తున్న సాయానికి అనీస్ కుటుంబం కృతజ్ఞతలు చెప్పిందన్నారు.

ఈశాన్య ఢిల్లీలోని పలు కాలనీల్లో అల్లరిమూకలు చుట్టుముట్టిన వందలాది ఇళ్లల్లో అనీస్ ఇల్లు కూడా ఒకటి. రెండంతస్తుల ఆ ఇంటికి 'ఇంటి నం.76,మహమ్మద్ అనీస్,బీఎస్ఎఫ్' అనే నేమ్‌ ప్లేట్ ఉంటుంది. ఆరోజు రాత్రి కాలనీలోకి చొరబడ్డ అల్లరిమూకలు కనీసం తమ ఇంటి ముందు నేమ్‌ప్లేట్‌లో ఉన్న 'బీఎస్ఎఫ్'ను చూసైనా వదిలిపెడుతారని భావించారు. కానీ అల్లరిమూకలు ఆ ఇంటినీ వదిలిపెట్టలేదు.
రెండంతస్తుల ఆ భవాన్ని తగలబెట్టడంతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. మరో మూడు నెలల్లో ఆ ఇంట్లో జరగాల్సి ఉన్న రెండు పెళ్లిళ్ల కోసం డబ్బు దాచుకోగా.. అది కూడా తగలబడిపోయింది.

English summary
The Border Security Force (BSF) said on Saturday that it will help rebuild its constable Mohammad Anees' house, which was among the hundreds of houses that were burnt in the riots in northeast Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X