వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BSNL సత్తా చాటుతుందా: త్వరలో విస్తరించనున్న 4జీ సేవలు, ఆఫర్స్ కూడా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో పోటీ ఇచ్చేందుకు తయారవుతోంది. ఇప్పటి వరకు కేవలం 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల్.. తమ కస్టమర్ల కోసం పలు ఎంపిక చేసిన నగరాల్లో 4జీ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతూ 3జీ సేవల్లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో 4జీకి సేవలను విస్తరించాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.

ఎంపిక చేసిన నగరాల్లో 4జీ సేవలు

ఎంపిక చేసిన నగరాల్లో 4జీ సేవలు

దేశంలోని బీఎస్ఎన్ఎల్ 20 సర్కిళ్లలోని 8500 ప్రాంతాలకు 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అక్కడ ఇప్పటికే 3జీ సేవలు ఉండగా వాటి స్థానంలో 4జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 4జీ సేవలు రాగానే క్రమంగా 3జీ సేవలకు గుడ్‌బై చెప్పనుంది బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్‌ఎల్ అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వస్తాయని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏయే సర్కిళ్లలో అయితే 3జీ సేవల వినియోగం తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో 4జీ సేవలను తీసుకొస్తుందని సమాచారం.

ఉచితంగా 4జీ సిమ్ కార్డు

ఉచితంగా 4జీ సిమ్ కార్డు

ముందుగా ఎక్కడైతే 3జీ సేవలు తక్కువగా వినియోగంలో ఉన్నాయో ముందుగా ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే అక్కడికి 4జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అమలు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఆ ప్రాంతాల్లో 4జీ సేవలు వినియోగంలోకి వస్తే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఆ సేవలను పొందేందుకు తమ సిమ్‌కార్డును అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు రూ. 20 వసూలు చేయడం జరుగుతుంది. మరికొన్ని సర్కిళ్లలో 4జీ సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటు కొన్ని డేటా బెనిఫిట్స్ కూడా పొందనున్నట్లు సమాచారం.

 4జీలో రెండు డేటా ప్లాన్లు

4జీలో రెండు డేటా ప్లాన్లు

ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను కేరళ, గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమలు చేస్తోంది. గత నెలలో కేరళలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కొత్త 4జీ ప్లాన్ తీసుకొచ్చింది. తద్వారా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం పై దృష్టి సారించింది. ఈ ప్లాన్ 234 రూపాయలు. 20 రోజుల వాలిడిటీతో 90 జీబీ డేటా ఇవ్వడంతో పాటు ఉచితంగా కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఉన్న 4జీ ప్లాన్ ప్రకారం రెండు డేటా ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. రూ.96 బేస్ ప్లాన్ తీసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 10జీబీ డేటాను అందిస్తోంది. మరో ప్లాన్ రూ.236గా ఉంది. ఇందులో కూడా రోజుకు 10 జీబీ డేటా అందిస్తుంది అయితే వాలిడిటీ మాత్రం 84 రోజులుగా ఉంటుంది.

English summary
State run telecom company BSNL had all plans to roll out its 4G services replacing the 3G services.By doing this and bringing in new data plans, BSNL is planning to give a competition in the telecom sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X