వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెయిట్ అండ్ వాచ్ : బీఎస్ఎన్ఎల్, జియోలు తమ టారిఫ్‌లను పెంచుతాయా..?

|
Google Oneindia TeluguNews

వాయిస్ మరియు డేటాలకు సంబంధించి బేస్ ప్రైస్ నిర్ణయిస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో మరో ఆప్షన్ లేక నష్టాల్లో ఉన్న ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు భారత్‌లో టారిఫ్‌లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. పెంచిన కొత్త టారిఫ్‌లో డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ రెండు ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను పెంచడంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, మరియు రిలయన్స్ జియోలు కూడా టారిఫ్‌లను పెంచుతాయనే వార్త షికారు చేస్తోంది.

టారిఫ్‌ల ప్రభావం సమీక్షించాకే నిర్ణయం: జియో

టారిఫ్‌ల ప్రభావం సమీక్షించాకే నిర్ణయం: జియో

ఎయిర్‌టెల్, వొడాఫోన్ టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను పెంచిన నేపథ్యంలో దాని ప్రభావం ఎలాగుంటుందో చూసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది రిలయన్స్ జియో యాజమాన్యం. ఇప్పటికే ప్రారంభిన తొలి మూడేళ్లలో ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా ఇవ్వడంతో చాలా వరకు టెలికాం కంపెనీలు నష్టాలబాట పట్టాయి. జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టగానే ఆ రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో కస్టమర్లను సొంతం చేసుకుంది. అంతా బాగా వెళుతున్న సమయంలో రిలయన్స్ సంస్థ కూడా బాంబు పేల్చింది. అక్టోబర్ 1 నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మాట్లాడే వారికి నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు వర్తిస్తాయంటూ ప్రకటించింది.

 ఎంతమేరకు పెంచుతున్నారో లేని క్లారిటీ

ఎంతమేరకు పెంచుతున్నారో లేని క్లారిటీ

ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్ఎల్ కూడా నష్టాల్లోనే ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ కూడా టారిఫ్‌ల పెంపుపై నిదానంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ముందుగా రెండు ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్‌ రేట్లు పెంచడంతో పరిస్థితి ఎలా ఉంటుందో గమనించాకే ఒక నిర్ణయానికి వస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. అంతేకాదు ఇప్పటివరకు ఎంత మేరకు పెంచుతున్నారో అనేదానిపై ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు ఎయిర్‌టెల్, మరియు వొడాఫోన్. ఈ రెండు సంస్థలు ఏమేరకు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నాయో చెప్పిన తర్వాత తమ విధానాన్ని వెల్లడిస్తామని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.

మూడేళ్ల తర్వాత తొలిసారిగా టారిఫ్‌ల పెంపు

మూడేళ్ల తర్వాత తొలిసారిగా టారిఫ్‌ల పెంపు


టెలికాం రంగంలోకి జియో రంగప్రవేశం చేయడంతో దీన్ని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, మరియు వొడాఫోన్‌లు తమ టారిఫ్ రేట్లను భారీగా తగ్గించాయి. దీంతో ఒక్కసారిగా నష్టాలబాట పట్టాయి. మళ్లీ మూడేళ్ల తర్వాత తొలిసారిగా టారిఫ్ రేట్లను రెండు సంస్థలు పెంచుతున్నాయి. కేంద్ర టెలికాం శాఖ ప్రవేశపెట్టిన ఏజీఆర్ కాంప్యుటయేషన్ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు ఎయిర్‌టెల్ వొడాఫోన్‌లకు సూచించడంతో ఇక చేసేదేమీలేక తమ టారిఫ్‌లను పెంచాలని డిసైడ్ అయ్యింది.

 జనవరి 24,2020 కల్లా రూ. 74వేల కోట్లు చెల్లించాలి

జనవరి 24,2020 కల్లా రూ. 74వేల కోట్లు చెల్లించాలి

ప్రభుత్వంతో తమ రెవిన్యూను పంచుకోవాలని సుప్రీంకోర్టు రెండు టెలికాం కంపెనీలకు సూచించింది. రెండు టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 24, 2020 కల్లా రూ.74వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రెండు టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సమయంలో కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతోంది. మొత్తం కాకపోయిన కాస్త ఊరటనిస్తూ కొంత డబ్బులు మాత్రమే చెల్లించుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు తాము రూ.50,921 కోట్ల మేరా నష్టాలు చవిచూసినట్లు వొడాఫోన్ ఐడియా గతవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30న ముగిసిన రెండో త్రైమాసికానికి అత్యధిక నష్టాలు పోస్టు చేసిన కంపెనీగా వొడాఫోన్ ఐడియా సంస్థ నిలచింది. మరోవైపు ఎయిర్‌టెల్ రూ.23,045 కోట్లు నష్టం వాటిలిన్నట్లు పేర్కొంది.

English summary
After Airtel and Vodafone said that they would be increasing their tariffs, BSNL and Jio said that they would wait and watch how things takeoff and then react on their tariffs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X