వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్: మరో కొత్త ప్లాన్‌కు శ్రీకారం.. రూ.100లోపు ..!

|
Google Oneindia TeluguNews

మీరు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులా..? బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగిస్తున్నారా.. అలాంటి కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఈ టెలికాం సంస్థ మల్టిపుల్ రీచార్జ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఇంతకీ ఈ మల్టిఫుల్ రీచార్జ్ అంటే ఏమిటి..? దీని కథాకమామిషు ఏంటి తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్


టెలికాం రంగంలోకి జియో ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి వరకు బాగున్న టెలికాం సంస్థలన్నీ ఒక్క కుదుపునకు లోనయ్యాయి. ఇక అప్పటికే ప్రముఖ ప్రైవేట్ ఆపరేటింగ్ టెలికాం సంస్థల నుంచి బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీని ఎదుర్కొంది. జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలానే బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను నిలుపుకునేందుకు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లతో వస్తూనే ఉంది. అంతేకాదు ఈ ప్లాన్లు కూడా సరసమైన ధరలలోనే ఉండటం కస్టమర్లకు మరొక ప్లస్ పాయింట్‌గా మారింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మల్టిపుల్ రీఛార్జ్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించే సదుపాయం కల్పిస్తోంది. ఇలా చేయడం వల్ల ప్లాన్ గడువు ముగిసినప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా చాలా స్మూత్‌గా ప్లాన్ కంటిన్యూ అవుతుంది.

 అడ్వాన్స్ పేమెంట్

అడ్వాన్స్ పేమెంట్

ఇప్పటి వరకు ప్లాన్ గడువు ముగిస్తే తిరిగి రీచార్జ్ చేయించుకుని మళ్లీ వినియోగించుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త ప్లాన్‌తో ముందుగానే డబ్బులు చెల్లిస్తే పాత ప్లాన్ గడువు ముగిసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. ఒక వేళ మనం ప్రయాణంలో ఉండి పాత ప్లాన్ గడువు ముగిస్తే రీఛార్జ్ చేయించేందుకు ఇబ్బంది పడతాం. అంతేకాదు ప్లాన్ గడువు ముగిస్తే ఇన్‌కమింగ్ ఔట్ గోయింగ్ కాల్స్ కూడా పనిచేయవు. అలాంటి సమయాల్లోనే ఈ మల్టిపుల్ రీచార్జ్ ఫెసిలిటీ ప్లాన్ ఉపయోగపడుతుంది.

ఏ ప్లాన్ వౌచర్లపై పనిచేస్తుంది..?

ఏ ప్లాన్ వౌచర్లపై పనిచేస్తుంది..?

కొత్తగా బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన మల్టిపుల్ రీచార్జ్ ఫెసిలిటీ ఒకే డినామినేషన్ ఉన్న ప్లాన్ వౌచర్లు, లేదా స్పెషల్ టారిఫ్ వౌచర్లపై మాత్రమే పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త ప్లాన్ యాక్టివేట్ కాగానే కస్టమర్ మొబైల్‌కు మెసేజ్ వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం రూ. 97, రూ.98, రూ.99, రూ.118, రూ.187, రూ. 247, రూ.319, రూ.399, రూ.429, రూ.485, రూ.666, రూ. 699, రూ.997, రూ.1699, రూ.1999 ప్లాన్ వౌచర్లు లేదా స్పెషల్ టారిఫ్ వౌచర్లపై మాత్రమే పనిచేస్తోంది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఇక ఇప్పటికే ఈ సదుపాయాన్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అయిన ఎయిర్‌టెల్, జియోలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. జియో ఏ డినామినేషన్‌తో అయిన అడ్వాన్స్ రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుండగా.. ఎయిర్‌టెల్ మాత్రం ఒకేసారి చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తోంది.

రూ.100 లోపు రెండు కొత్త ప్లాన్లు

రూ.100 లోపు రెండు కొత్త ప్లాన్లు

ఇక బీఎస్ఎన్ఎల్ రూ.100కు తక్కువగా రెండు కొత్త ప్లాన్లను ప్రారంభించింది. ఒకటి రూ.94 మరొకటి రూ.95. వీటిపేర్లు బీఎస్ఎన్ఎల్ అడ్వాన్స్ పర్ మినిట్ రూ.94 మరియు బీఎస్ఎన్ఎల్ అడ్వాన్స్ పర్ సెకండ్ రూ.95. ఇది 2జీ, 3జీ, మరియు 4జీలకు కూడా వర్తిస్తాయి. రూ.94 ప్లాన్ నిమిషాల లెక్కన ఉండగా... రూ.95 ప్లాన్ సెకను లెక్కన తీసుకోవడం జరుగుతుంది. రెండు ప్లాన్లు 3జీబీ హైస్పీడ్ డేటాను ఇస్తాయి. ఇది 90 రోజుల పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. అంతేకాదు 100 నిమిషాలపాటు ఉచిత వాయిస్ కాల్స్ కూడా అందిస్తోంది. ఈ కాల్స్ లోకల్ నుంచి జాతీయ స్థాయిలో రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా వినియోగించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈ వెసులుబాటును 90 రోజుల్లోగా వినియోగించుకోవాలని ఆ తర్వాత యథాతథంగా చార్జీలు విధించబడతాయని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.

English summary
BSNL had introduced a new Multiole Recahrge facility to its prepaid users.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X