జియోకు షాక్: 3 కొత్త ఆఫర్లను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్, ఉచిత వాయిస్ కాల్స్, డేటా
న్యూఢిల్లీ:రిలయన్స్ జియో ఇస్తోన్న ఆఫర్లతో తన కస్టమర్లను ఇతర నెట్ వర్క్ ల వైపుకు వెళ్ళకుండా అడ్డుకొనేందుకుగాను బిఎస్ ఎన్ ఎల్ కొత్త ఆఫర్ ను ప్రకటించింది.రూ.395, రూ.333. రూ.349లతో కొత్త ఆఫర్లను ప్రకటించాయి.
బిఎస్ ఎన్ ఎల్ మూడు కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. రిలయన్స్ జియో నుండి పోటీని ఎదుర్కొనేందుకుగాను బిఎస్ఎన్ ఎల్ ఈ మేరకు కొత్త ఆఫర్లను ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
ఇతర ప్రైవేట్ టెలికం ఆపరేటర్ల తరహాలోనే ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ ఎన్ ఎల్ కూడ తన కస్టమర్లను కాపాడుకొనేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా ఇతర నెట్ వర్క్ ల వైపుకు తన కస్టమర్లను కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది.
ఎయిర్ టెల్, ఐడియా, టెలినార్ లాంటి కంపెనీలు కూడ జియో ధనాధన్ ఆఫర్ ప్రకటించిన తర్వాత కొత్త ఆఫర్లను ప్రకటించాయి. రిలయన్స్ జియో ఏదో ఒక కొత్త ఆఫర్ ను ప్రకటించిన వెంటనే ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లతో ముందుకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మూడు కొత్త ఆఫర్లను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
బిఎస్ఎన్ ఎల్ మూడు కొత్త ఆఫర్లను ప్రకటించింది.ఈ కొత్త ఆఫర్ల ద్వారా తమ కస్టమర్లను ఇతర నెట్ వర్క్ ల వైపుకు ముఖ్యమంగా జియో వైపుకు వెళ్ళకుండా అడ్డుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది.రూ.333 , రూ.395, రూ.349 లతో మూడు వేర్వేరు ప్లాన్ లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ల ద్వారా జియో నెట్ వర్క్ తో పాటు ఇతర నెట్ వర్క్ ల వైపుకు తమ కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది.

రూ.333 ప్లాన్ తో ప్రతిరోజూ 3 జీబీ డేటా
రూ.333 ప్లాన్ ను తీసుకొన్న బిఎస్ఎన్ ఎల్ వినియోగదారులకు ప్రతి రోజూ 3జీ స్పీడ్ తో 3 జీబీ డేటాను ఇవ్వనున్నారు. అయితే 90 రోజులవరకు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ఆఫర్ ను తీసుకొన్న కస్టమర్లకు 270 జీబీ హై స్పీడ్ తో 3 జీబీ డేటా అందుతోంది.

రూ.349 తో మరో ప్లాన్ ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
దిత్ కోల్ కే బోల్ పేరుతో రూ.349 ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ పథకం కింద ఎస్ టి డితో పాటు లోకల్ కాల్స్ ను కూడ అపరిమితంగా ఇవ్వనున్నట్టు బిఎస్ఎన్ ఎల్ ప్రకటించింది.2 జీబీ డేటాను 3జీబీ డేటా స్పీడ్ తో ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ రిలయన్స్ జియో ధనాధన్ ఆఫర్ తరహాలోనే ఉంది.అయితే ఉచితంగా ఎస్ఎంఎస్ ను, వాయిస్ కాల్స్ ను అందించనున్నట్టు బిఎస్ఎన్ ఎల్ ప్రకటించింది.దేశంలో ఉచితంగా రోమింగ్ సౌకర్యాన్ని కూడ కల్పించింది. ప్రతిరోజూ 1 జీబీ 4 జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్ 84 రోజులపాటు ఉంటుంది.

రూ.395 ప్లాన్ తో 71 రోజల వ్యాలిడిటీ
రూ.395 ప్లాన్ తో బిఎస్ఎన్ఎసల్ 3 వేల నిమిసాలపాటు బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ఫోన్లకు ఉచితంగా మాట్లాడుకొనే సౌకర్యాన్ని కల్పించింది.మరో వైపు 1800 నిమిషాల పాటు ఇతర నెట్ వర్క్ లకు చెందిన కంపెనీల ఫోన్ లకు ఉచితంగా మాట్లాడుకొనే వెసులుబాటు కల్పించింది.2 జీబీ డేటాను 3 జీబీ స్పీడ్ తో అందించనుంది బిఎస్ఎన్ ఎల్. ఈ పథకం 71 రోజుల వరకు వర్తిస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!