వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటు టెలికాంల బాటలో బీఎస్ఎన్ఎల్.. చార్జీల మోత.. డిసెంబర్1 నుండి బాదుడే

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేటు టెలికాం ల దెబ్బతో తన చార్జీలను డిసెంబర్ 1, 2019 నుండి పెంచనున్నట్టు ప్రకటించింది. ఎయిర్టెల్, వోడాఫోన్ మరియు జియో ఇటీవల రాబోయే రోజుల్లో భారీగా చార్జీలను పెంచుతామని ప్రకటించిన తరువాత బీఎస్ఎన్ఎల్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. . ఎజీఆర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రైవేటు టెలికాం కంపెనీలకు తాజా ఇబ్బందిగా మారింది. సుప్రీంకోర్టు యొక్క ఎజిఆర్ తీర్పు కారణంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి టెలికాం కంపెనీలు చార్జీల వడ్డనకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

 వెయిట్ అండ్ వాచ్ : బీఎస్ఎన్ఎల్, జియోలు తమ టారిఫ్‌లను పెంచుతాయా..? వెయిట్ అండ్ వాచ్ : బీఎస్ఎన్ఎల్, జియోలు తమ టారిఫ్‌లను పెంచుతాయా..?

సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో మూడు నెలల వ్యవధిలో టెలికాం కంపెనీలు అన్ని బకాయిలను భారత ప్రభుత్వానికి చెల్లించాలని టెలికాం కంపెనీలను కోరింది. ఆపరేటర్లు టెలికాం శాఖకు (డిఓటి) రూ .92,000 కోట్ల వరకు చెల్లించాలి. ఈ నేపధ్యంలో ఆర్ధిక కష్టాల నుండి గట్టెక్కటానికి ప్రైవేట్ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచాయి. బిఎస్ఎన్ఎల్ డిసెంబర్ 1, 2019 నుండి తమ వినియోగదారులకు షాక్ ఇస్తూ చార్జీలను పెంచుతుంది మరియు ప్రస్తుతం దాని వాయిస్ మరియు డేటా చార్జీలను సమీక్షిస్తోంది.

BSNL tariffs hike from december 1st.. move comes after Airtel, Vodafone and Jio

బిఎస్‌ఎన్‌ఎల్‌ను, ఎమ్‌టిఎన్‌ఎల్‌తో విలీనం చేయడానికి ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమ్‌టిఎన్‌ఎల్-బిఎస్‌ఎన్‌ఎల్ పునరుజ్జీవన ప్రణాళికలో రూ .29,937 కోట్లు, రెండు సంస్థల సంయుక్త ఆస్తులతో కలిపి 38,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రెండు సంస్థలు తమ పునరుజ్జీవనం కోసం రూ .15 వేల కోట్ల సావరిన్ బాండ్‌ను సేకరించనున్నాయి.

ప్రభుత్వం పరిపాలనా కేటాయింపు ప్రాతిపదికన 4 జి స్పెక్ట్రంను అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ విలీనానికి క్యాబినెట్ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది మరియు ఎమ్‌టిఎన్‌ఎల్, పద్ధతులు అమలయ్యే వరకు ఎమ్‌టిఎన్‌ఎల్, బిఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా ఉంటుందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ సమావేశంలో అన్నారు. ఇక ప్రైవేట్ టెలికాంల తరహాలో బీఎస్ఎన్ఎల్ తీసుకున్న తాజా నిర్ణయంతో చార్జీల మోత మొగనుంది.

English summary
State-owned telecom operator BSNL has announced a hike in its tariff starting December 1, 2019. The move comes after Airtel, Vodafone and Jio recently announced to increase the tariff in the coming days. The Supreme Court's judgment on AGR has become the latest trouble for the private telcos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X