వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటరిగానే బరిలోకి, బిఎస్ పి, 97 సీట్లు ముస్లింలకు, ఎస్ పి, బిజెపిల మధ్య పొత్తు

ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీచేస్తోంది బిఎస్ పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదన్నారామె. ఎస్ పి, బిజెపిలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ :ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో తాము ఓంటరిగానే పోటీచేస్తామని బిఎస్ పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆమె కార్యకర్తలను కోరారు.కాంగ్రెస్ పార్టీని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదన్నారామె, ఎస్ పి, బిజెపి లు లోపాయికారిగా ఈ ఒప్పందంతో ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఏడుదఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బిఎస్ పి అధినేత్రి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

బిఎస్పి ఈ ఎన్నికల్లో దళితులు, ముస్లింలు అనే వ్యూహంతో ముందుకువెళ్తోంది. ఈ రెండు వర్గాలను కలుపుకొని పోవడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనే యోచనలో ఆ పార్టీ ఉంది.

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం తనకు రాజకీయంగా కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది. బిజెపి తోనే తమకు ప్రధానమైన నోటీ ఉంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

 ఒంటరిగానే బరిలోకి బిఎస్ పి

ఒంటరిగానే బరిలోకి బిఎస్ పి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుొంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించారు. లక్నోలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు.తన పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఆడంబరాలకు పోకూడదని ఆమె సూచించారు.

 బిజెపిపై విమర్శలు గుప్పించిన మాయావతి

బిజెపిపై విమర్శలు గుప్పించిన మాయావతి

మంచిరోజులు తెస్తామని ప్రకటించిన బిజెపి అన్ని రకాలుగా విఫలమైందని బిఎస్ పి అధినేత్రి మాయావతి ఆరోపించారు. పెద్ద నగదు నోట్లు రద్దుచేసిన తర్వాత దేశంలో అన్ని మంచి రోజులే వస్తాయని బిజెపి ప్రకటించిందని, యాభై రోజులు దాటినా ఇంకా మంచిరోజులు రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. బిజెపిని లక్ష్యంగా చేసుకొని ఆమె విరుచుకు పడ్డారు. ఏ ఒక్క వాగ్దానాన్నీ కూడ మోదీ అమలు చేయలేదని ఆమె విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బిజెపికి చెడ్డదినాలు వస్తాయని ఆమె జోస్యం చెప్పారు.ఇందుకు బిజెపినా కులు సిద్దంగా ఉండాలన్నారు.

 తప్పు చేస్తే ఎందుకు శిక్షించడం లేదు?

తప్పు చేస్తే ఎందుకు శిక్షించడం లేదు?


ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయానికి ముందు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాయావతి మండిపడుతున్నారు. తన సోదరుడిపై, తన కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగానే బిజెపి ఈ ఆరోపణలను చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలే నిజమైతే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

 ముస్లింలకు 97 టిక్కెట్లు కేటాయించిన బిఎస్ పి

ముస్లింలకు 97 టిక్కెట్లు కేటాయించిన బిఎస్ పి

సమాజ్ వాదీ పార్టీకి ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వారిని తన వైపుకు తిప్పుకొనేందుకుగాను బిఎస్ పివ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.400 అసెంబ్లీ స్థానాలకు బిఎస్ పి తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో 97 స్థానాలకు ముస్లింలకు కేటాయించింది. ఈ దఫా దళితులు, ముస్లింలు అనే నినాదంతో ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.

 కాంగ్రెస్ లెక్కలోలేనేలేదు

కాంగ్రెస్ లెక్కలోలేనేలేదు

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని మాయావతి అభిప్రాయపడ్డారు. బిజెపి, సమాజ్ వాదీ పార్టీలు లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకొన్నాయని ఆమె ఆరోపించారు.

English summary
we are go alone in upcominig uttarpradesh elections, said bsp supremo mayavati .she already announced 400 candidates for elections. out of 400 seats, mayavati alloted 97 seats for muslims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X