వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్‌ ధిక్కరించిన బీఎస్పీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు...వేసిన మాయావతి..

|
Google Oneindia TeluguNews

కర్ణాటక అసెంబ్లీ బల నిరూపణలో భాగంగా పార్టీ విప్‌ను ధిక్కరించినందుకుగాను బీఎస్పీ ఎమ్మెల్యేను ఆపార్టీ నుండి బహిష్కరించినట్టు బీఎస్పీ చీఫ్ మాయవతి ప్రకటించారు. కాగా బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహెష్‌ను పార్టీ విప్‌ను దిక్కరించినందుకు కాగా పార్టీ నుండి బహిరిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా మహేష్ అటు ప్రభుత్వానికి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఓటు వేయకుండా సభకు హజరుకాకుండా తప్పించుకున్నాడు. పార్టీ మాత్రం కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు పలకాలని విప్‌ను జారీ చేసింది.

BSP MLA N Mahesh expelled him with immediate effect who violated directions of party

ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు చెందిన 12 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు.. జేడీఎస్‌ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించి సభకు హజరు కాకుండా దూరంగా ఉన్నారు. అలాగే, కాంగ్రెస్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్య కారణాలతో సభకు దూరమయ్యారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సభకు దూరంగా ఉండటంతోపాటు బీఎస్పీ ఎమ్మెల్యే సైతం సభకు దూరంగా ఉన్నారు. దీంతో అధికార పక్షానికి తగిన సంఖ్యాబలం లేని కారణంగా కుమార సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది.

కాంగ్రెస్ ,జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించింది. చివరకు ముగ్గురు కూడ ప్రభుత్వానికి హ్యాండ్ ఇచ్చారు. మరి పార్టీ విప్ ధిక్కరించిన 12మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటీ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
BSP Chief Mayawati Despite directions from party high command to vote in favor of HD Kumaraswamy, BSP MLA N Mahesh didn't attend the trust vote & violated directions, which is an act of indiscipline. Party has taken this seriously & expelled him with immediate effect
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X