వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే..! మరోసారి ఏకిపారేసిన మాయావతి

|
Google Oneindia TeluguNews

లక్నో : లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ పార్టీతో బీఎస్పీ మైత్రి నెరుపుతుందనుకునే సమయంలో బెడిసికొట్టింది. అందుకే అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని లెఫ్ట్, రైట్ కొట్టేస్తున్నారు. ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై ఆ రెండు పార్టీలను చెడుగుడు ఆడేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒకే గూటికి చెందిన రెండు పక్షులని మండిపడ్డ మాయావతి.. తాజాగా మరోసారి మాటల తూటాలు పేల్చారు.

పవన్ కల్యాణ్ సీఎం కావాలి..! వామ్మో గణేశా..! నీ పల్స్ దొరికేదెట్టయ్యా? పవన్ కల్యాణ్ సీఎం కావాలి..! వామ్మో గణేశా..! నీ పల్స్ దొరికేదెట్టయ్యా?

టార్గెట్ కమలం

బీజేపీ టార్గెట్ గా మాటల యుద్ధం ప్రకటించారు మాయావతి. ఛాన్స్ దొరికితే చాలు ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. అదే కోవలో మైత్రిబంధం దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆ రెండు పార్టీలపై తనదైన శైలిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇండియా.. ఇండియా అంటే మోడీ అనే రీతిలో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇండియా మీ సొత్తా? మాయావతి గుస్సా

ఇండియా మీ సొత్తా? మాయావతి గుస్సా

కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే బీజేపీ రిపీట్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అప్పట్లో ఇందిరాగాంధీ అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరాగాంధీ అనే టైపులో ప్రచారం చేసుకున్నారని ఫైరయ్యారు. ఇందిరాగాంధీ చేసినట్లే ఇప్పుడు మోడీ తాపత్రాయపడుతున్నారని ఆరోపించారు. ఇది చూస్తూ కూర్చునే అంశం కాదని.. తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి తప్పులను ప్రజలు క్షమించబోరని ట్వీట్ చేశారు.

 ఒకే దెబ్బకు రెండు పిట్టలు..!

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..!

ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారత సైన్యాన్ని ఉదహరిస్తూ మోడీ సేనగా పేర్కొనడంతో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్లైంది. వీలున్నప్పుడల్లా ఆ అంశాన్ని తెరపైకి తెస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఆ క్రమంలో మాయావతి కూడా బీజేపీని టార్గెట్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కూడా ఏకిపారేస్తున్నారు. ఏప్రిల్ 11 న తొలిదశ ఎన్నికలు జరగనుండటంతో.. ఆ పనుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ట్విట్టర్ వేదికగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.

అంబానీలను మించాడు.. పిట్టల దొర కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి..! లక్షల కోట్ల ఆస్తులు, అప్పులుఅంబానీలను మించాడు.. పిట్టల దొర కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి..! లక్షల కోట్ల ఆస్తులు, అప్పులు

 స్కెచ్చ్ వేశారిలా..!

స్కెచ్చ్ వేశారిలా..!

ఎన్నికల వేళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా మాయావతి ఇలా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ కూటమి పరస్పర అంగీకారంతో కొన్ని స్థానాల్లో పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఎస్పీ కూటమి మధ్య అంతర్గత ఒప్పందం ఉందనేది బీజేపీ నేతల వాదన. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో తమ కూటమికి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే మాయావతి కాంగ్రెస్ పార్టీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు.

English summary
BSP supremo Mayawati has targeted BJP and Congress during the Lok Sabha polls. Mayawati playing Left and Right both Congress and BJP. She was busy with elections, at the same time fires on bjp and congress in twitter platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X