వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్డీ కామెంట్లపై దుమారం .. జవాన్ల ధైర్య సాహసాలతో రాజకీయాలా ? అని కాంగ్రెస్ మండిపాటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిని బీజేపీ రాజకీయ వాడుకోవాలని చూడటం దుమారం రేపుతోంది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత, మాజీ సీఎం యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైటర్ల దాడులతో బీజేపీకి కలిసొస్తుందని .. కర్ణాటకలో 22 లోక్ సభ సీట్లు గెలుస్తామని మాట్లాడటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

దాడులతో రాజకీయాలా ? సుర్జేవాలా మండిపాటు

దాడులతో రాజకీయాలా ? సుర్జేవాలా మండిపాటు

యడ్డీ కామెంట్లను రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. సైనికుల ధైర్య సాహసాలను .. పార్టీకి అన్వయించి మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 'ప్రియమైన మోదీ, జైట్లీ, 130 కోట్ల భారతీయుల ప్రయోజనం కోసం సైనికులు చేసిన దాడిని మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటారా‘ అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాణ్ దీప్ సుర్జేవాలా.

దాడులు-సీట్ల లెక్కల్లో యడ్డీ బిజీ

దాడులు-సీట్ల లెక్కల్లో యడ్డీ బిజీ

యడ్డీ వ్యాఖ్యలను కర్ణాటక సీఎం కుమారస్వామి తప్పుపట్టారు. వైమానిక దాడుల తర్వాత .. భారత సైన్యానికి దేశమంతా మద్దతు తెలుపుతోంది. కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి అండగా ఉంటామని స్పష్టంచేసింది. కానీ కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప మాత్రం తన లోక్ సభ సీట్ల లెక్కల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. పాక్ పై చేసిన దాడులతో తమకేమన్నా సీట్లు పెరుగుతాయని అంచనాలు వేస్తున్నారని మండిపడ్డారు.

యడ్డీ అంచనా తప్పు

యడ్డీ అంచనా తప్పు

దాడులతో తమకు కలిసి వస్తోందనే యడ్డూరప్ప కామెంట్లను విపక్ష కాంగ్రెస్ ఖండిస్తుంటే .. బీజేపీలో కూడా వ్యతిరేకత వస్తోంది. కేంద్రమంత్రి విజయ్ కుమార్ సింగ్ యడ్డీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 'ఒక దేశం, ప్రజల యొక్క భద్రత రక్షణ కోసం సరైన చర్యలు తీసుకుంటున్నాం, అంతే తప్ప ఎన్నికలో సీట్లు కాదు‘ అని స్పష్టంచేశారు. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో యడ్డీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు.

English summary
Congress spokesperson Randeep Singh Surjewala took a dig at Narendra Modi over Yeddyurappa's statement that "India's preemptive strikes on terror camps in Pakistan has created a wave in favour of the prime minister". The entire nation is united in supporting the central govt&our armed forces to fight terrorism,while #Bjp leader BSYBJP is busy calculating howmany extra LS seats the terror attack&Pak war can bring to his party. It's shameful to exploit our jawans' sacrifice for electoral gains. Minister of state for external affairs Gen (retired) Vijay Kumar Singh said that he differed with his party member, Yeddyurappa. "We stand as one nation, action taken by our government is to safeguard our nation and ensure safety of our citizens, not to win a few extra seats," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X