వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమ బుద్ధుడి బోధనలే నేడు ప్రపంచానికి ఆదర్శం: ధర్మచక్ర దినోత్సవ ప్రసంగంలో మోడీ

|
Google Oneindia TeluguNews

మనకు జ్ఞానం పంచిన చదువు నేర్పిన గురువులను స్మరించుకోవాల్సిన రోజు ఈ రోజని ప్రధాని మోడీ అన్నారు. ఆషాడ పూర్ణిమ సందర్భంగా గౌతమ బుద్దుడు నేర్పిన జీవిత సత్యాల గురించి ప్రధాని మోడీ రాష్ట్రపతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ గౌతమ బుద్ధుడికి సంబంధించిన పలు అంశాలను గుర్తు చేశారు. గౌతమ బుద్దుడు కూడా ప్రపంచానికి జ్ఞానం పంచాడని, ఈ క్రమంలోనే ఈ రోజు ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు.

PM Master Plan: చైనా చెత్తబుద్ది, పాక్ వక్రబుద్ది, మోడీ ముందే పిల్లిగంతులు, ఓలి పదవికి ఎసరు, ఔరఔర! PM Master Plan: చైనా చెత్తబుద్ది, పాక్ వక్రబుద్ది, మోడీ ముందే పిల్లిగంతులు, ఓలి పదవికి ఎసరు, ఔరఔర!

మంగోలియా సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడుతోందని ప్రధాని మోడీ చెప్పారు. మంగోలియాలో ఉన్న బౌద్ధ మఠాలకు ఎంతో చరిత్ర ఉంది. దేనికదే ప్రత్యేకంగా నిలుస్తోందన్నారు ప్రధాని మోడీ. గౌతమ బుద్ధుడు సూచించిన అష్టాంగమార్గాలు సమాజానికి ప్రపంచ దేశాలకు ఒక మేల్కొలుపుగా నిలిచాయి. మానవాళి పట్ల కరుణ, దయతో కలిగి ఉండాలని ప్రధానంగా చెబుతుంది. మనిషి యొక్క ఆలోచనలు, క్రియలు ఎలా ఉండాలో బుద్దుడి బోధనలు చెబుతాయి.

Buddhas eightfold path shows the well being of many nations:PM Modi on Dharma Chakra Day

పేదలను, మహిళలను మొత్తంగా మనుషులను ఎలా గౌరవించాలో బుద్ధుడు ప్రపంచానికి నేర్పాడని చెప్పిన ప్రధాని శాంతి అహింసలు ఆయన ప్రధాన ఆయుధాలని వెల్లడించారు. బౌద్ద మతం కూడా ఎన్నో విషయాలను చెబుతుంది. బుద్ధుడు సార్‌నాథ్‌లో తన తొలి ప్రసంగంలో ఆశ మరియు ప్రయోజనాల గురించి బోధించారని మోడీ చెప్పారు. ఆశ నుంచే ప్రయోజనం కలుగుతుందని బుద్ధుడు చెప్పినట్లు మోడీ గుర్తుచేశారు. మానవుడు అనుభవిస్తున్న హింసను బుద్ధుడు సహించలేకపోయాడని చెప్పిన ప్రధాని మోడీ... ప్రతి ఒక్కరం హింసను వీడేందుకు కృషి చేయాలని మంచి ఆలోచనలతో బయటకు రావాలని చెప్పారు.

21 శతాబ్దం పై తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. ఈ నమ్మకం దేశ యువత నుంచే తనకు కలుగుతోందని ప్రధాని చెప్పారు. స్టార్టప్ రంగాన్ని యువత ఎలా ముందుకు తీసుకెళుతుందో చూస్తే మనకు నమ్మకం కలుగుతుందని ప్రధాని చెప్పారు. ప్రపంచదేశాలే అబ్బురపోయేలా మన దేశ యువత ఆలోచనలు ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు. భారత్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ వ్యవస్థ ఉందని ప్రధాని చెప్పారు. ఈ సమయంలో యువత బుద్ధుడు బోధించిన పాఠాలను ఒకసారి నెమరువేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. బుద్దుడు చెప్పిన బోధనలు ప్రేరణ కలిగిస్తాయి. కష్టసమయాల్లో ధైర్యాన్ని ఇస్తాయని ప్రధాని మోడీ చెప్పారు. బుద్ధుడు చెప్పిన అప్పదీపోభవ మంచి మేనేజ్‌మెంట్ స్కిల్ అని చెప్పారు. అంటే నీకు నీవే దీపంలా మారి వెలుగును ఇవ్వాలని దానర్థమని ప్రధాని యువతకు సూచించారు.

Recommended Video

PM Modi In Leh : China పై ప్రధాని Modi పంచముఖ వ్యూహం.. Ladakh ఎందుకు వెళ్లారంటే..! | Oneindia Telugu

ఈ రోజు ప్రపంచం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాలంటే బుద్ధుడి బోధనలు తప్పకుండా ఉపయోగపడుతాయని ప్రధాని చెప్పారు. ఈ బోధనలు ఎప్పుడూ పనికొస్తాయని వెల్లడించారు. బుద్ధుడు ప్రవచనాలు బోధనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పిన ప్రధాని మోడీ ఖుషీనగర్ విమానాశ్రయంను అంతర్జాతీయ విమానాశ్రయంగా తయారు చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు, బుద్ధుడి భక్తులు వస్తారని తద్వారా చాలామందికి ఆర్ధికంగా అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోడీ చెప్పారు. చివరిగా దేశప్రజలకు ధర్మచక్ర దినోత్సవం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు ప్రధాని మోడీ.

English summary
PM Modi addressed celebration of Dharma Chkra day via video conference. He said that Buddha had always taught compassion and love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X