వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నిజాయితీగా పన్ను చెల్లిస్తే ప్రయోజనం': ఇలా నల్లధనానికి చెక్

నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఈ బడ్జెట్ ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఈ బడ్జెట్ ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయంచామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పారు.

<strong>'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్‌లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'</strong>'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్‌లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ఉపాధి హామీకి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విజయవంతంగా కొనసాగుతున్న మరిన్ని రంగాలకు కేటాయింపులు చేశామన్నారు.

Budget 2017-18: Arun Jaitley presents 'historic' budget after demonetisation

నల్లధన నిర్మూలనకు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. అయిదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు.

ఇక, నల్లధనానికి చెక్

నల్లధనం, అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు డిజిటల్ ఎకానమీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగితే అవినీతి తొలగిపోతుందని జైట్లీ అన్నారు.

దేశ ప్రగతికి ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్న నల్లధనం, అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు డిజిటల్‌ ఎకానమీకి ప్రాధాన్యం ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగితే అవినీతి తొలగిపోతుందని జైట్లీ అన్నారు.

పూర్తి పారదర్శకంగా జరిగే లావాదేవీలతో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా మారుతుందన్నారు. ఇప్పటికే 'జామ్' (జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌) ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, వ్యాపార ఆధారిత లావాదేవీల్లో ఆధార్ సహితమైన వ్యవస్థను త్వరలోనే రూపొందించనున్నట్లు చెప్పారు.

దీనివల్ల డెబిట్‌ కార్డులు, మొబైల్‌వాలెట్లు, మొబైల్‌ ఫోన్లు లేని వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థతో సామాన్యునికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం ప్రారంభించిన భీమ్‌ యాప్‌ను ఇప్పటికే 125 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకొని బ్యాంకింగ్‌ లావాదేవీలకు వినియోగిస్తున్నారు.

English summary
Arun Jaitley presents 'historic' budget after demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X