వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
budget2018 union budget 2018 union budget of india rail budget arun jaitley budget bitcoin కేంద్ర బడ్జెట్ 2018 రైల్వే బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
బడ్జెట్:బిట్ కాయిన్స్‌పై ఉక్కుపాదం: జైట్లీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనుహ్యంగా తన రేటును పెంచుకొన్న డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్స్ వంటి క్రిఫ్టో కరెన్సీలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనున్నట్టు ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు గురువారం నాడు ప్రకటించారు.
బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టో కరెన్సీలపై ప్రభుత్వం వీటి వాడకాన్నిపూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ క్రిప్టో కరెన్సీల వాడకాన్ని ప్రస్తావించారు. వీటిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

చెల్లింపు వ్యవస్థల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీని పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. మరోవైపు బిట్‌కాయిన్స్ పట్ల మదుపుదారులు అప్రమత్తంగా ఉండాలని, వీటి ఒడిదుడుకులకు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించింది.