వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌పై ప్రధాని మోడీ ఏమన్నారంటే: ప్రపంచంలోనే తొలిసారి భారత్ ఇలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ ప్రజల ఆశలకు అద్దం పట్టిన బడ్జెట్ ఇది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఈ బడ్జెట్ దేశ పురోభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇది సామాన్యులు, రైతుల బడ్జెట్ అన్నారు.

ఈ బడ్జెట్ గ్రామీణ భారతానికి కొత్త అవకాశాలు తీసుకు వస్తుందని చెప్పారు. కాగా, ఈ బడ్జెట్ గ్రామీణ భారతానికి, రైతులకు ఊతం ఇచ్చేలా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలకు ఊతమిస్తుందన్నారు.

Budget 2018 Live: Farmer friendly, business friendly, development friendly, Modi hails Budget

కాగా, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు వీలుగా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం పేరిట కేంద్రం సరికొత్త పథకం ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య భద్రతా కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

2018 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రసంగిస్తూ.. రీసెర్జ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ఊతమిచ్చేవిధంగా వచ్చే నాలుగేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తున్నామని, వడోదరలో స్పెషలైజ్డ్ రైల్వే యూనివర్సిటీని నెలకొల్పనున్నామని, ఆరోగ్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆరోగ్యం వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం జాతీయ ఆరోగ్య విధానం 2017 కింద రూ.1200 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.

English summary
'The farmers, Dalits, tribal communities will gain from this Budget. It will bring new opportunities for rural India' says PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X