వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: 80 సీ సెక్షన్ కింద పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

బడ్జెట్‌ 2018 : పెట్టుబడుల పరిమితుల పెంపుకు జైట్లీ యోచన?

న్యూఢిల్లీ:2018 బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త ఉండే అవకాశం ఉందని సమాచారం. సెక్షన్ 80 సీ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ. లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

బడ్జెట్‌లో ఈ ఏడాది వేతన జీవులకు ప్రయోజనం కల్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా తెలుస్తోంది.

ఆదాయ పన్ను మినహయింపు పరిమితిని కూడ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సిన అవసరం మాత్రం ఉంది.

పెట్టుబడుల పరిమితిని 80 సీ కింద రూ. 2 లక్షల పెంచే యోచన

పెట్టుబడుల పరిమితిని 80 సీ కింద రూ. 2 లక్షల పెంచే యోచన

పన్ను చెల్లింపు దారులకు వెసులుబాటును కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. సెక్షన్ 80 సీ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ. 2 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని తీసుకొంటే రూ.2 లక్షల వరకున్న బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి పెట్టుబడులకు పన్ను చెల్లించవసరం లేదు.

ప్రస్తుతం రూ.1.50 లక్షలకు మాత్రమే పన్ను మినహయింపు

ప్రస్తుతం రూ.1.50 లక్షలకు మాత్రమే పన్ను మినహయింపు

ప్రస్తుతం కేవలం రూ.1.50 లక్షలకు మాత్రమే పన్ను మినహయింపు ఉంది. ప్రాఫిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌, ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పిల్లల ట్యూషన్‌ ఫీజు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, స్పెషిఫిక్‌ మ్యూచవల్‌ ఫండ్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో పెట్టుబడి పెట్టే మొత్తంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు తీసుకొనే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం.

పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం

పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం

ప్రభుత్వం 80 సీ కింద పెట్టుబడుల పరిమితులను పెంచాలని నిర్ణయం తీసుకొంటే పొదుపు ఖాతాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏటా రూ. 10 లక్షలుంటే సెక్షన్ 80 సీ కింద రూ. 2 లక్షలు పెట్టుబడులకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సమయంలో ఈ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదు.

పన్ను మినహయింపు పరిమితి పెంపు యోచన వెనుక

పన్ను మినహయింపు పరిమితి పెంపు యోచన వెనుక

జైట్లీ తన తొలి బడ్జెట్‌ 204-15లోనే ఈ పరిమితిని రూ.50వేల నుంచి లక్షన్నరకు పెంచారు. ప్రస్తుతం మరోసారి ఈ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని అరుణ్‌ జైట్లీ యోచిస్తున్నారు. ఇటీవల బ్యాంకుల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లతో అరుణ్‌జైట్లీ నిర్వహించిన మీటింగ్‌లో దీనిపై చర్చించినట్టు తెలిసింది.

English summary
Finance minister Arun Jaitley may raise tax breaks offered on money parked in a slew of products including bank fixed deposits, insurance premium and mutual funds from Rs 150,000 to Rs 200,000 a year under the popular “Section 80C” scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X