వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండి బడ్జెట్: వ్యక్తిగత పన్ను రాయితీ నుంచి.. ఏఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget 2018 Expectations : ఫిబ్రవరి 1న బడ్జెట్: ఆకాంక్షలు నెరవేరేనా?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2018-19కి గాను ఆయన ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వ్యవసాయ రంగానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వబోతోందని, వ్యాపార రంగానికి అనుకూలంగా బడ్జెట్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్ రంగాలు బడ్జెట్ నుంచి ఎన్నో ఆశిస్తున్నాయి.

ట్యాక్స్

ట్యాక్స్

కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం. వ్యక్తిగత పన్ను రాయితీలను పెంచడం. దీర్ఘకాల పెట్టుబడులపై ట్యాక్స్ విధింపు.

బ్యాంకింగ్

బ్యాంకింగ్

అప్పులు తీసుకున్నవారి నాన్ పర్ఫామింగ్ అస్సెట్స్ పైన పూర్తి స్థాయిలో ట్యాక్స్ ఎత్తివేత. బ్యాంక్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి సంబంధించి ప్రస్తుత కనిష్ట డిపాజిట్ల స్థాయిని రూ.10వేలకు మించి పెంచడం. రీటెయిల్ టర్మ్ డిపాజిట్లకు సంబంధించి ట్యాక్స్ మినహాయింపులను అయిదేళ్ల కాల పరిమితి నుంచి మూడేళ్లకు తగ్గించడం. ఇన్ సాల్వెన్సీ కోడ్ కింద ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం.

బంగారం:

బంగారం:

స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు దిగుమతులపై ఉన్న ట్యాక్స్‌ను 10 శాతం నుంచి రెండు నుంచి నాలుగు శాతానికి తగ్గించడం.

టెక్నాలజీ/ఐటీ

టెక్నాలజీ/ఐటీ

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు ఎక్కువ ప్రోత్సాహకాలు. డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సహకారం. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లకు సంబంధించి అనుకూలమైన ఎక్సైజ్ డ్యూటీ.టారిఫ్ స్ట్రక్చర్ మరింత అనుకూలం.

ఆటోమొబైల్:

ఆటోమొబైల్:

కాలం చెల్లిన కమర్షియల్ వాహనాలపై నిషేధం. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు.

రియల్ ఎస్టేట్

రియల్ ఎస్టేట్

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సింగిల్ విండో క్లియరెన్స్. ఇళ్లను తక్కువ ధరకే అందించడం కోసం చర్యలు. ప్రస్తుతం 12 శాతం ఉన్న జీఎస్టీని తగ్గించడం. స్టాంప్ డ్యూటీ తగ్గించడం.

వ్యవసాయం

వ్యవసాయం

వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రుణ లభ్యతకు సంబంధించి ఫండ్ ఏర్పాటు. పంటల బీమా కోసం ఎక్కువ నిధులు ఇవ్వడం. డ్యాంలు, కెనాల్స్, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ కోసం మరిన్ని పెట్టుబడులు. కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణాలకు సబ్సిడీలు.

మెటల్స్ అండ్ మైనింగ్

మెటల్స్ అండ్ మైనింగ్

వంటకు వాడే బొగ్గుపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. ఐరన్ ఓర్ ఎగుమతులపై సుంకం తగ్గింపు. దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు అల్యూమినియమ్ స్క్రాప్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచడం. మినరల్స్ అన్వేషణ కార్యక్రమానికి చేయూతనివ్వడం.

English summary
The government will unveil its Budget for the fiscal year 2018-19 on Thursday, with investors expecting increased investment in key areas such as agriculture, and a slew of incentives for businesses. The economy is expected to post a growth of 6.75 per cent in the 2017/18 fiscal year ending in March, which would be the slowest in three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X