వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయపన్ను రూ.5 లక్షలు సహా బడ్జెట్‌పై నరేంద్ర మోడీ ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2019 : Narendra Modi Comments On Union Budget | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆదాయపన్ను మినహాయింపును తాము రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వేతనజీవులు కోరుకుంటున్న దానిని తమ ప్రభుత్వం చేసి చూపిందని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పారు. ఎన్నికల తర్వాత మరోసారి అభివృద్ధి మంత్రంతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు.

<strong>వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్‌కు ఎంత పన్ను అంటే?</strong>వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్‌కు ఎంత పన్ను అంటే?

ఇది తాత్కాలిక బడ్జెట్ మాత్రమేనని.. అంటే బడ్జెట్ ట్రయలర్ మాత్రమే అన్నారు. అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది అని చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అని చెప్పారు. ఈ బడ్జెట్ పైన అన్ని వర్గాల్లో సంతృప్తి ఉందని చెప్పారు. ఈ సంక్షేమ బడ్జెట్ ప్రజలకు సంతృప్తిని ఇచ్చిందని, ఇది సంతృప్తికర బడ్జెట్ అన్నారు.

 Budget 2019 is for New India, for all Indians: it will energise the nation: PM Narendra Modi

ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుకున్నారని ప్రధాని చెప్పారు. ప్రజల కోరికను ఈనాటికి ప్రభుత్వం నెరవేర్చగలిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ ముందడుగు అన్నారు.

మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, కూలీలకు.. ఇలా అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. రైతుల కోసం ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయని, కానీ ఆ పథకాలు కేవలం రెండు లేదా మూడు కోట్ల మందికి లబ్ధి చేకూర్చేవని, కానీ పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఐదు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్న వారికి నేరుగా బడ్జెట్ అకౌంట్‌లో వేస్తామని చెప్పారు.

English summary
From middle class to labourers, from farmers growth to the development of businessmen, from manufacturing to MSME sector, from growth of the economy to development of New India, everyone has been taken care of in this interim budget, says Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X