వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: బడ్జెట్‌తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. వాల్ ఫ్యాన్లపై 20 శాతం పన్ను పోటు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : What Gets Costlier and What Gets Cheaper

2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నాయి..? ఏయే వస్తువుల పెరగబోతున్నాయి..? ఏవి తగ్గబోతున్నాయో.. తెలుసుకుందాం.. పదండి.

వాల్ ఫ్యాన్లపై

వాల్ ఫ్యాన్లపై

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాల్ ఫ్యాన్ల కస్టమ్స్ డ్యూటీ పెంచుతామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతోపాటు పింగాణి పాత్రలు, వంట గదికి సంబంధించిన వస్తువులపై కూడా పన్ను పోటు పెరిగింది. వాల్ ఫ్యాన్లపై పన్ను ఇప్పుడు 7.5 శాతం ఉంది. దానిని 20 శాతానికి పెంచారు. పింగాణి పాత్రలు, వంట గది వస్తువులపై కూడా పన్ను పెరుగుతోందని పేర్కొన్నారు. చైనా సిరామిక్, క్లై ఐరన్, స్టీల్, రాగి పాత్రలపై కూడా పన్నుపోటు విధించారు. సిగరేట్లు, పొగాకు ఉత్పత్తులు, ఫుట్‌వేర్, ఫర్నీచర్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మందుల ధర కూడా పెరగనుంది.

కమర్షియల్ వాహనాలపై కూడా

కమర్షియల్ వాహనాలపై కూడా

వస్తువులే కాదు కమర్షియల్ వాహనాలపై కూడా ట్యాక్స్ వేశారు. కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ విధించారు. ఈ-కామర్స్ ఆపరేటర్లు అన్ని లావాదేవీలకు సంబంధించి ప్యాన్/ఆధార్ కార్డు వివరాలు అందజేస్తే 1 శాతం, వివరాలు అందించకుంటే 5 శాతం చొప్పున పన్ను విధిస్తామని ప్రకటించారు.

తగ్గేవి ఇవే..

తగ్గేవి ఇవే..

ముడి పంచదార, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ట్యూనా బైట్, టెట్రా మిల్క్, కొన్ని మద్య పానీయాలు, సోయా ఫైబర్, సోయా ప్రొటిన్ ధరలు తగ్గనున్నాయి. ప్రింట్ చేసే పేపర్ ధర, లైట్ వెయిట్ పేపర్ ధర 5 శాతం వరకు తగ్గనుంది.

ధరలు పెరిగేవి ఇవే

ధరలు పెరిగేవి ఇవే


సిగరేట్లు/ పొగాకు ఉత్పత్తులు
విదేశాల నుంచి దిగుమతి చేసిన ఫుట్‌వేర్/ ఫర్నీచర్
విదేశాల నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్
వాల్ ఫ్యాన్లపై సెస్ పెంపు
విదేశాల నుంచి దిగుమతి చేసిన పింగాణి వస్తువులు/ వంట సామాగ్రి
చైనా సిరామిక్, క్లె ఐరన్, స్టీల్, కాపర్

ధరలు తగ్గేవి ఇవే

ధరలు తగ్గేవి ఇవే

న్యూస్ పేపర్ ప్రింట్ చేసే పేపర్
తేలికపాటి పేపర్ ధర 5 శాతం వరకు తగ్గింపు
ముడి చక్కెర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
ట్యూనా బైట్, టెట్రా మిల్క్, కొన్ని మద్యపానీయలు
సొయ ఫైబర్, సొయా ప్రొటిన్ ధరల తగ్గింపు

English summary
Budget 2020 News in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X