వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: సామాన్యునికి ఆశాజనకంగానే బడ్జెట్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : First Budget of The New Decade

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వేతన జీవులైతే తమకు కాస్తంతైనా పన్నుల నుంచి ఉపశమనం కలిగిస్తారేమోనని మరింత ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ కూడా సామాన్యులకు మేలు చేసేదిగానే ఉండనుందని తెలుస్తోంది.

union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి? union budget 2020: పాపులిస్ట్ బడ్జెట్ అంటే ఏమిటి?

ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపుపన్ను మినహాయింపు కూడా కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. అంతేగాక, వ్యవసాయ రంగానికి, మౌలిక రంగానికి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Budget 2020 may be a feel good one for the common man

వినియోగదారుల డిమాండ్, పెట్టుబడులు పెంచుకోవడానికి అన్ని చర్యలను తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా, భారత్ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలంటే దేశ జీడీపీ ఏటా ఏనిమిది శాతానికిపైగా వృద్ధిరేటు సాధించాల్సి ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయ రంగం ఐదు శాతం వార్షిక వృద్ధిరేటు సాధిస్తే జీడీపీ వృద్ధి ఎనిమిది శాతానికి చేరుతుందంటున్నారు.

పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మినహాయిస్తే.. ప్రస్తుతం వ్యవసాయ రంగంపై ఖర్చు 3 శాతమే కావడం గమనార్హం. దీన్ని ఈ బడ్జెట్‌తో ఐదు శాతానికి పెంచాలని అభిప్రాయపడ్డారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకనామి సాధ్యమయ్యే అవకాశం ఉంది.

English summary
A cut in personal income tax, sops for rural and agriculture sectors as well as an aggressive push on infrastructure spending are likely to be part of finance minister Nirmala Sitharaman's "feel-good" second Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X