వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2021: పద్దుతో పెరిగేవీ, తగ్గేవి ఇవే.. ఓ సారి చూడండి.. గతేడాది లిస్ట్ కూడా లుక్కేయండి..

|
Google Oneindia TeluguNews

ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. స్వయం శక్తితో ఎదిగేందుకు ఆత్మనిర్భర్ భారత్‌ను కేంద్రం ప్రకటించింది. ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన, మిషన్ పోషన్ 3.0 కూడా ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం నిర్మలా కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అన్నీ రంగాలకు సమన్యాయం చేస్తూ.. బడ్జెట్ చదివారు. బడ్జెట్‌తో ధర పెరిగేవి ఏవో.. తగ్గేవి ఏవో ఓసారి చుద్దాం పదండి.

పెరిగేవీ ఇవే..

పెరిగేవీ ఇవే..

2021 పద్దులో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. మొబైల్ ఫోన్స్, చార్జర్ల ధరలకు రెక్కలు రానున్నాయి. వినియోగదారుల అవసరాన్ని బట్టి మొబైల్ ధరలు పెరుగుతుంటాయి. ఈ సారి పద్దు ద్వారా కూడా పెరిగాయి. అలాగే రత్నాల ధరలు పెరిగాయి. లెథర్ షూ ధర కూడా పెరుగుతుంది. కాబులీ చానా, పప్పులు, యూరియా, ఆటో స్పెర్ పార్ట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి. దిగుమతి చేసుకున్న క్లాత్స్, వంట నూనే, ఆటో పార్ట్స్ ధరలు పెరిగాయి.

తగ్గేవి ఇవే..

తగ్గేవి ఇవే..

ఐరన్, స్టీల్ ధర తగ్గాయి. నైలాన్ క్లాత్స్ ధరలు తగ్గనున్నాయి. కాపర్ వస్తువుల ధరలు కూడా దిగొచ్చాయి. ఇన్సురెన్స్ చేసుకునేవారికి కూడా బెనిఫిట్స్ కలిగించారు. షూ ధరలు కూడా తగ్గాయి. అయితే మామాలు షూ ధర మాత్రం తగ్గుతాయి. లెథర్ షూ రేట్ మాత్రం కాదనే విషయం గమనించాలి. డ్రై క్లీనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా దిగొచ్చాయి. వెండి, బంగారం ధరలు తగ్గాయి.

గతేడాది ఇలా

గతేడాది ఇలా


గతేడాది ఫుట్‌వేర్, ఫర్నీచర్, ఏసీ, ఆటో, ఆటో పార్ట్స్, ఆహార ఉత్పత్తులు, క్రూడ్ ఫామాయిల్, పేపర్ ట్రే ధర పెరిగాయి. బైండర్, క్లిప్పు ధరలు కూడా పెరిగాయి. దిగుమతి చేసుకున్న న్యూస్ ఫ్రింట్, లైట్ వెయిట్ పేపర్ ధరలు తగ్గాయి. టునా బాయిట్, స్కిమ్మ్‌డ్ మిల్క్, స్పోర్ట్స్ వస్తువులు, మెక్రోఫోన్స్, ఎలక్ట్రిక్ వైర్ల ధరలు తగ్గాయి. ఈ సారి పైన చెప్పుకున్న వస్తువుల ధరలు, పెరిగి తగ్గాయి.

English summary
Union Budget 2021-22, touted as the most important budget in the decades, came at a time when India is reeling under the COVID-19 crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X