వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మలా ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఫాలో అవడం లేదు..? ఎంతైనా లేడీస్ లేడీసే అబ్బా...

|
Google Oneindia TeluguNews

మరికాసేపట్లో బడ్జెట్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తొలిమహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అప్పట్లో ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకుని ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రులంతా మగవారే అయ్యారు. కానీ కేంద్ర ఆర్థికశాక మంత్రిగా ఒక మహిళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టం మాత్రం ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు ఆర్థికశాఖ మంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోయే ముందు ఒక సూట్‌కేసుతో పార్లమెంటుకు చేరుకునేవారు. ముందుగా మీడియా ముందు ఆ బ్రీఫ్ కేసు చూపించి ఆపై పార్లమెంటులోకి అడుగుపెట్టేవారు. కానీ ఈసారి మాత్రం నిర్మలా సీతారామన్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఏది చేసినా ప్రత్యేకత చాటుకునే మన తెలుగింటి కోడలు ఈసారి బడ్జెట్ ప్రతులను ఓ బ్యాగులో తీసుకొచ్చారు. సాధారణంగా మహిళలు తమవెంట హ్యాండ్‌బ్యాగ్ తీసుకెళుతుంటారు. అది వారికి చాలా ఇష్టం. ఇప్పుడు మన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఓ ఎర్రటి బట్ట చుట్టి ఉన్న బ్యాగులో బడ్జెట్ డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫోటోను చూసిన నెటిజెన్లు కూడా కొత్త పద్దతిని స్వాగతించారు. గత దశాబ్దాలుగా పాత సూట్‌కేసునే చూస్తున్నామని నిర్మలా సీతారామన్ ఏమి చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని కొనియాడారు.

Recommended Video

Union Budget 2019 : మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ || Oneindia
Budget bag:Good bye to suitcase system, Nirmala sitharaman creates new trend with the bag

ఇదిలా ఉంటే అంతకుముందు ఆర్థికశాఖ మంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఓ సూట్‌కేసును తీసుకొచ్చేవారు. అయితే ఈ పద్ధతి పాశ్చాత్య దేశాల నుంచి తీసుకున్నామని ఇప్పుడు కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో భారత సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు ముఖ్య ఆర్థికసలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ తెలిపారు. బడ్జెట్ ప్రతులను ఓ బ్యాగులో ఉంచి దానిపై ఎరుపు రంగు ఉన్న వస్త్రాన్ని చుట్టారు. వస్త్రంపై జాతీయ చిహ్నంను ముద్రించడం జరిగింది. పాశ్చాత్య దేశపు ఆలోచనల నుంచి మన సొంత పద్ధతిలోకి రూపాంతరం చెందామని సింబాలిక్‌గా చెప్పే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్. ఇది బడ్జెట్ కాదని దేశానికి సంబంధించిన లెడ్జర్‌గా అభివర్ణించారు.

మొత్తానికి నిర్మలా సీతారామన్ పాతపద్దతిని ఫాలో అవడం లేదని కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారని ఇది దేశానికి శుభపరిణామం అని నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంతైనా లేడీస్ కదా... హ్యాండ్ బ్యాగు లేకుండా బయటకు వెళ్లరు.. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌ను హ్యాండ్‌బ్యాగులో తీసుకొచ్చారని వ్యాఖ్యలు చేశారు.

English summary
Waving a good bye to the old tradition of carrying a briefcase just before presenting the budget, the finance Minister Nirmala sitharaman came out with a new bag where the budget documents were wrapped with a red cloth. Netizens were all happy and welcomed the new idea by the Finance Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X