వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget 2019 : Ram Nath Kovind Says NDA Has Improved Governance Systems | Oneindia Telugu

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు రాష్ట్రపతి.

Budget sessions live updates

రాష్ట్రపతి ప్రసంగంలో హైలైట్స్:

అవినీతిరహిత పాలన అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం

ప్రతి పౌరుడి జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నాం

నిరుపేదలకు విద్యుత్ వంట గ్యాస్ అందుబాటులోకి తెచ్చాం

ఇప్పటి వరకు ఉజ్వల పథకం కింద 6 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం

గత నాలుగేళ్లలో కోటికి పైగా ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చాం

హృద్రోగృలకు స్టంట్ ధరలు తగ్గించాం

ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాం

మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల గౌరవాన్ని పెంచాం

ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్ పథకం కింద 9 కోట్ల టాయ్‌లెట్లు నిర్మించాం

50 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం

దివ్యాంగుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నాం

స్టార్టప్ ఇండియాతో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్నాం

దివ్యాంగులకు సమాన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం

సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం

నేడు అన్ని రంగాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు

అత్యాచారం పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకున్నాం

ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చాం

ముద్రా రుణాల్లో అత్యధిక రుణాలు మహిళలకే చెందాయి

రైతులకు కనీస మద్దతు ధర రెట్టింపు చేశాం

రైతుల ఉత్పత్తులకు మంచి ధర కల్పించడం మాలక్ష్యం

పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నాం

సిటిజెన్ షిప్ బిల్లును కూడా సరళతరం చేస్తున్నాం

ఇతరదేశాల్లో హిందువులు హింసకు గురై భారత్‌కు చేరుకుని పౌరసత్వం కోరుకునే వారికి పౌరసత్వ బిల్లును సరళతరం చేస్తున్నాం

ఇక విద్యార్థులకు ఉన్నత విద్య నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది

ప్రభుత్వం కొత్త విద్యాసంస్థలకు శ్రీకారం చుట్టింది

7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, 14 ట్రిపుల్ ఐటీలు, 1 ఎన్ఐటీ, 4 ఎన్ఐడీలను తీసుకొస్తుంది. వీటికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి

దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం

సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులను తరిమికొట్టాం

దేశ రక్షణ విషయంలో రాజీ పడటం లేదు

వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నాం

ఉడాన్ పథకంతో సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి తీసుకొచ్చాం

విదేశాల్లో చిక్కుకుపోయిన 2.20లక్షల మందిని సురక్షితంగా భారత్‌కు రప్పించాం

రాఫెల్ యుద్ధ విమానాల రాకతో దేశం మరింత సురక్షితంగా మారుతుంది

గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం కృషి చేస్తోంది

చిన్న నగరాల్లో పాస్‌పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేశాం

English summary
President Ram Nath Kovind has started addressing the joint sitting at Parliament. He is to list out the achievements of the ruling NDA government during the session. He said he is committed to a corruption free India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X