వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్దుపై క్లారిటీ ? జూలైలో ప్రవేశపెట్టేందుకు మోడీ ఓకే ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరనుండటంతో .. ఇక బడ్జెట్‌పై చర్చకు దారితీసింది. ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో .. పూర్తిస్థాయి పద్దును సమర్పించాల్సి ఉంది. జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ భావిస్తోన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

సంక్షేమానికి ప్రయారిటీ ..
పూర్తిస్థాయి బడ్జెట్ అయినందున సంక్షేమ పథకాలను మోడీ కొనసాగించే అవకాశం ఉంది. ఆ పథకాలకే బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేసేందుకు మొగ్గు చూపనుంది. దీంతోపాటు రైతుల సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేస్తారు. వ్యవసాయం, వస్తువులు .. తదితర కోసం గతంలో కన్నా నిధులు కేటాయింపు ఎక్కువ ఉంటాయని సంకేతాలిచ్చారు. ఉపాధి అవకాశాల గురించి సమూలంగా వివరించి ... ఉపాధి కల్పన కోసం కొత్త పథకాలు రూపొందించే యోచనలో మోడీ 2.0 సర్కార్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

budjet to be held in july

రియల్‌కు కూడా ..
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో రైతులకు, మధ్యతరగతి వారికి రాయితీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా, నిర్మాణ రంగాలకు కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌లో పెద్దపీట వేస్తారని సమాచారం. వీటితోపాటు చిన్నతరహా పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియాకు కూడా కేటాయింపుల శాతం దండీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం బార్లా తెరిచి .. కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

English summary
Modi govt discussion on the budget on july month. In the wake of the electoral backdrop of the vote on- account budget, a full-scale fund is to be submitted. It is credible that Modi govt is expected to introduce the July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X